మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. శివసేన నేత, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే.. మూడు ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో అధికార మహాయుతి కూటమిలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందన్న ప్రచారం మొదలైంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి ఘన విజయం సాధించగా, షిండేకు సీఎం పదవి ఇవ్వకపోవడంతో శివసేనలో అసంతృప్తి వ్యక్తమైంది.  



తర్వాత ఇప్పుడు కొందరు శివసేన ఎమ్మెల్యేలకు 'వై'- సెక్యూరిటీ తొలగించడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ పరిణామాలు మహారాష్ట్ర సర్కారులో చీలికకు దారి తీశాయని తెలుస్తోంది.  అంతేకాకుండా, శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న షిండే.. ''నన్ను తేలికగా తీసుకోకండి.. నన్ను తేలికగా తీసుకున్న వారితో నేను ఇప్పటికే చెప్పాను.  నేను సాధారణ పార్టీ కార్యకర్తని.. కానీ, బాలాసాహెబ్ కార్యకర్తను కూడా.



నన్ను తేలికగా తీసుకున్న సమయంలో 2022లో ప్రభుత్వాన్ని మార్చాను.  తర్వాత ప్రజలు కోరకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు సుపరిపాలన అందించాను అందుకే నేను చెబుతున్నా.. నన్ను తేలికగా తీసుకోకండి" అంటూ హెచ్చరించారు.   ఇప్పుడు ఈ వార్తలు జాతీయ స్థాయిలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఏక్ నాథ్ షిండే ఎందుకు ఈ మాటలు అన్నారు ఆయన ఏం చేయనున్నారు అనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.


నేను ఓ సాధారణ కార్యకర్తను.. కానీ నేను బాబా సాహెబ్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తిని. ప్రతి ఒక్కరు దీనిని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో మహాయతి ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయని.. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న ఊహాగానాలు జరగుతున్న నేపథ్యంలో ప్రస్తుత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం నన్ను తేలిగ్గా తీసుకోవద్దు అనే డైలాగ్ తో మహారాష్ట్ర ప్రభుత్వంలో ఏం అవుతుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, బీజేపీ నేత ఆశిష్ షెలార్ దీనిని తోసిపుచ్చారు. కూటమిలో, ఎలాంటి చీలిక లేదని, ప్రభుత్వం ఐక్యంగా నడుస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: