- ( ప‌ల్నాడు - ఇండియా హెరాల్డ్ ) . . .


పల్నాడు జిల్లాలోని.. వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడుకు సొంత పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి భారీ ఎత్తున సెగ తగులుతుంది. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు కూడా బొల్లా బ్రహ్మనాయుడుకు వైసీపీ సీటు ఇవ్వద్దని.. పార్టీలోని ఓవర్గం నాయకులు రాజకీయాలు చేశారు. మరీ ముఖ్యంగా.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు బొల్లాకు సీటు వద్దని గట్టిగా పట్టుబట్టారు. అయితే.. జగన్ బొల్లా ఆర్థికంగా బలంగా ఉన్నాడని.. అతనికే టిక్కెట్ ఇస్తున్నాం. మీరందరూ కలిసి పని చేసి గెలిపించండని చెప్పడంతో.. వినుకొండ వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం నేతలు అందరూ అయిష్టంగానే పనిచేశారు.


కొందరు టిడిపికి సపోర్ట్ చేశారు. ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి సామాజిక నేతలకు క్లాస్ కూడా తీసుకున్నారు. అప్పట్లోను నాయకులు బొల్లాను మార్చాలని పట్టుబెట్టారు. జగన్ మాత్రం తన తీసుకున్న నిర్ణయం ఫైనల్ అని తేల్చి చెప్పారు. ఇప్పుడు మరోసారి బొల్లా వ్యవహారం తెర మీదకు వచ్చింది. వినుకొండ వైసీపీ ఇన్చార్జిగా ఉన్న బొల్లాను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని అన్ని మండలాలకు చెందిన 50 మందికి పైగా నాయకులు తాడేపల్లికి క్యూ కట్టారు.


బొల్లాతో అవసరం లేదని.. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చుండూరు వెంకటేశ్వర్లుకు ఈ బాధ్యత అప్పగించాలని.. ఆయన ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేస్తామని వారు చెబుతున్నారు. బొల్లాను తొలగించే వరకు పార్టీ కార్యక్రమాలలో తాము పాల్గొనేది లేదని.. తేల్చి చెబుతున్నారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బొల్లాపై వ్యతిరేకత ఇప్పుడు కొత్త కాదు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి సొంత పార్టీలో నేతలను ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటినుంచి ఈ తంతు కొనసాగుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: