
ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీలో అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఆ పార్టీ పంజాబ్ లోనే అధికారంలో ఉంది. భగవంత్ మాన్ సింగ్ నేతృత్వంలోని అక్కడి ఆప్ ప్రభుత్వం ప్రస్తుతం పాలన సాగిస్తోంది. అయితే దిల్లీలో అధికారం పోయిన దగ్గర నుంచి అందరి చూపు పంజాప్ పైనే పడింది. కేజ్రీవాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో పంజాబ్ కు చెందిన వార్త తెగ వైరల్ అవుతోంది.
2022 మార్చిలో పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్ నేతృత్వంలో సర్కారు ఏర్పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా 2023 మేలో కుల్దీప్‌సింగ్ దళివాల్ కు రెండు శాఖలు కేటాయించింది. అందులో ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ ఫోరమ్స డిపార్ట్‌మెంట్ ఒకటి. 2024 చివరన మరోసారి పునర్‌వ్యవస్థీకరఱ చేశారు. ఆమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజాగా దానిని సవరించింది. కుల్‌దీప్ సింగ్‌కు కేటాయించిన అడ్మిడిస్ట్రేవ్ రిఫామ్స్ శాఖ ఉనికిలో లేకపోవడంతో సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. అంటే ఉనికిలో లేని శాఖకు కుల్‌దీప్‌సింగ్ 20 నెలలు మంత్రిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం దానిని సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అసలు విషయం బయటికివచ్చింది.
తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం.. కుల్‌దీప్‌సింగ్ ఇకపై ఎన్నారై వ్యవహారాల శాఖను మాత్రమే నిర్వహిస్తారని పేర్కొంది. దీంతో బీజేపీ నేతలు మాన్ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు సోషల్ మీడియాలో మాన్ సర్కార్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. అరవింద్ కేజ్రివాల్ ఆదేశాల మేరకు మన సీఎం భగవంత్ మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కుల్దీప్ సింగ్ ధాలివాల్ని 'పరిపాలనా సంస్కరణల శాఖ' మంత్రిగా చేసింది,' అని సోషల్ మీడియా యూజర్ అమితాబ్ చౌదరి ట్వీట్ చేశారు. ఇలాంటివి ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో తెలియజేస్తుందని పేర్కొన్నాడు. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని తెలిపాడు.