
అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా. ప్రస్తుతం అమెరికా నుంచే ఈ కార్లు దిగుమతు అవుతున్నాయి. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం వల్ల టెస్లా కార్ల ధర ఎక్కువగా ఉంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భారత్ లో అధిక దిగుమతి సుంకాలు వల్ల తమ ఉత్పత్తులు అమ్ముకోలేకపోతున్నామని స్పష్టం చేశారు.
ఇక కార్ల మార్కెట్ కు దేశంలో ఎక్కువ అవకాశాలు ఉండటంతో స్థానికంగా పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి చేస్తే భారత మార్కెట్లో పుంజుకోవచ్చని టెస్లా భావిస్తోంది. ఈ మేరకు భారత మార్కెట్లో అడుగు పెట్టేందుకు వేగంగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో దిగ్గజ దీంతో దేశంలో ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తోంది. అయితే టెస్లా పరిశ్రమ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నందున దేశంలో పలు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
అయితే దీనిపై మాట్లాడిన ట్రంప్.. భారత్ లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాట అన్యాయమే అని బాంబ్ పేల్చారు. ప్రపంచంలోని అన్ని దేశాలు మమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత ప్రభుత్వం సుంకాలు ద్వారా లాభపడాలని చూస్తోందన్నారు. మస్క్ కు ఇది లాభదాయకమై ఉండొచ్చు.. కానీ అమెరికా పరంగా చూస్తే మాత్రం ఇది అన్యాయమని పేర్కొన్నారు. ఇక టెస్లా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి టెస్లా విక్రయ కార్యకలాపాలపై ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
టెస్లాను తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే అన్ని వనరులు సమకూరుస్తామని మహారాష్ట్ర, గుజరాత్, ఏపీ ప్రభుత్వాలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. టెస్లా యాజమాన్యాన్ని టెంప్ట్ చేసేలా ఏపీ ప్రభుత్వం పలు ఆఫర్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి దిగుమతుల కోసం టెస్లాకు ఏకంగా ఓ పోర్టు అప్పగిస్తామని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మరి మస్క్ ట్రంప్ ని కాదని.. భారత్ లో పెట్టుబడులు పెడతారా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. ఏది ఏమైనా ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా భారత్ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.