- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి సైలెంట్ రాజకీయాలు, సైలెంట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా ప్రచారం బయటికి వచ్చింది. ప్రస్తుతం కూటమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే.. పవన్ కళ్యాణ్‌కి మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే సంకేతాలు పంపుతున్నారు. మిత్రపక్షాలుగా ఉన్నంత మాత్రాన.. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కీలక సమాచారం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బిజెపి నాయకులు ఎప్పటికప్పుడు కేంద్ర అధినాయకత్వానికి పంపుతున్నట్టు తెలుస్తోంది.


గత పదేళ్ళ‌కు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి.. ఇదే మోడల్ ఫాలో అవుతూ.. కీలక నేతలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున పవర్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జ‌రిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పవర్ షేరింగ్ మాత్రమే కాదు.. పౌర ప్రాజెక్టుల్లో కూడా ఇద్దరు కీలకనేతల మధ్య చేరిక‌ జరిగింది అంటూ బిజెపికి చెందిన ఎంపీ ఒకరు.. పలు పూర్తి వివరాలుతో కూడా నివేదికను ఢిల్లీ బిజెపి పెద్దలకు అందజేసినట్టు తెలుస్తోంది.


పవన్ కళ్యాణ్‌కు ఎంతో సన్నిహితంగా ఉంటున్నా లింగమనేని రమేష్ బంధువులకు చెందిన కంపెనీలకు అనుమతులు మంజూరు చేయటం.. మళ్ళీ ఆ కంపెనీ తనకు దక్కిన అనుమతులను ఇతర సంస్థలకు బదిలీ చేయడం వెనక.. పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగిందని సదరు బిజెపి ఎంపీ తన నివేదికలో.. బిజెపి పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా కేంద్రంలో ఉన్న బిజెపి నాయకత్వం చంద్రబాబు మీదే కాదు.. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా చాలా సైలెంట్‌గా ఆపరేషన్ మొదలుపెట్టినట్టు దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. బీజేపీ మిత్ర ప‌క్ష పార్టీ లు అయిన టీడీపీ - జ‌న‌సేన తో ఉంటూనే వాళ్ల కార్య‌క‌లాపాల‌పై ఓ క‌న్నేసి ఉంచుతున్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap