శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ ఎల్ బి సి టన్నల్ ప్రమాదం 8 మంది ప్రాణాలను ముప్పులో పడేసింది. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ ఎల్ బి సి టన్నల్ ప్రమాదం పై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.


శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం విషయంలో గతాన్ని నెమరు వేసుకుంటే అనేక పరిణామాలు, లోపాలు వెలుగులోకి వస్తున్నాయని చాడ వెంకట రెడ్డి తెలిపారు. 2005లో ప్రతిపాదన చేసి జయప్రకాష్ ఏజెన్సీకి అప్పగిస్తే నాటినుండి కొనసాగుతూనే ఉందని చాడ వెంకట రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత పెద్ద సొరంగ మార్గం 45 కిలోమీటర్లు, 30 సార్లు ఇస్టిమేషన్ రివైస్ చేశారని చాడ వెంకట రెడ్డి వివరించారు.


మారుతున్న కాలానికి అనుగుణంగా రేట్స్ పెరిగాయని చాడ వెంకట రెడ్డి తెలిపారు. తాము 2007లో శ్రీశైలం శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సందర్శించినప్పుడు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పామని చాడ వెంకట రెడ్డి గుర్తు చేశారు. నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు నీరు అందించే కార్యక్రమంగా ఉంటుందని తాము తెలిపామని చాడ వెంకట రెడ్డి వివరించారు.


కొంత కేటాయింపు జరిగిన అనంతరం తెలంగాణ ఉద్యమం ఇతర పరిణామాలు, రివైజు జరిగిన పనులు పూర్తి కాలేదని చాడ వెంకట రెడ్డి పేర్కొన్నారు. గతం లాగానే ఉండిపోయిందని,  2019 నుండి నిధులు కేటాయింపు జరగలేదని, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదానికి కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి స్పందించినప్పటికీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా చర్యలు తీసుకోవాలని చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు.


ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అవసరమైన మేరకు నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని చాడ వెంకట రెడ్డి సూచించారు. నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని చాడ వెంకట రెడ్డి ఆరోపించారు. గతంలో కూడా కేసీఆర్్ కు వినతి పత్రం  ఇచ్చామని ఆయన తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చాడ వెంకట రెడ్డి మరోసారి గుర్తు చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: