ఇటీవల భారత ప్రధాన మంత్రి నరేేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు కూడా. అయితే మోదీ అమెరికా పర్యటన తర్వాత.. అదానిపై అమెరికాలో ఉన్న కేసు విచారణలో అదానీకి అనుకూలంగా పరిణామాలు జరిగాయి. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందం ముద్దాయిగా ఉన్న భారత కార్పొరేట్‌ దిగ్గజం అదానీని రక్షించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వెళ్లారన్న విమర్శలు వస్తున్నాయి.


మోదీ అమెరికా టూర్ ప్రధాన ఉద్దేశ్యం అదానీని కాపాడటంగానే  కన్పిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఈ మేరకు అమెరికా పార్లమెంట్‌ ముందు నుంచి సోషల్‌ మీడియా వేదికగా నారాయణ ఆదివారం ఒక వీడియో సందేశం ఇచ్చారు. మోదీ అమెరికా పర్యటనలో భాగంగా వాష్టింగ్టన్ లో  ఒక వైపు ట్రంప్‌ను కలిశారని, మరోవైపు ఎలాన్‌మస్క్‌ను కలిశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు.


మోదీ చాలా మంచివారని ట్రంప్‌ మాట్లాడుతున్నారన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అయితే మస్క్‌ను కలిసిన తర్వాత అర్థమైనదేమిటంటే..ఇప్పటికే న్యూయార్క్‌ కోర్టులో భారతదేశ కార్పొరేట్‌ దిగ్గజమైన అదానీపైన లంచం కేసు ఒకటి నమోదైందని గుర్తు చేశారు. ఇదే అమెరికా గడ్డ వేదికగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఒప్పంద వ్యవహారంపై ఈ లంచం వ్యవహారం వెలుగు చూసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.


ఈ ఒప్పందంలో దాదాపు 2 లక్షల కోట్ల అదానీకి లాభం చేకూర్చేటట్లుగా, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంపై భారం మోపేలా ఈ ఒప్పందాలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివరించారు. దీంతో అదాని ముద్దాయిగా ఆరోపణలున్నాయని, దీనిపై ఫిర్యాదు రావడంతో న్యూయార్క్‌ కోర్టులో కేసు నమోదైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు.


మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మస్క్‌తో భేటీ అనంతరం.. ఇది అదానీని రక్షించేందుకేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సంఘటనలతో అంతర్జాతీయ కుంభకోణాల్లో భారత ప్రభుత్వం కూరుకుపోయే ప్రమాదముందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పర్యటనతో జాగ్రత్త పడాల్సిన అవసరముందని నారాయణ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: