
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ వచ్చే ఉగాది నాటికి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో జనసేన నాయకుడు నాగబాబుకు అవకాశం ఇస్తారని టాక్ తెలిసిందే. ఆయనతో పాటు ఒకటి రెండు స్థానాలను కూడా మార్పు చేసే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సమస్యలు పెరిగిపోవడంతో కొంత మంద గమనంలో సాగుతున్నాయి. మంత్రులను మార్చడం మాత్రం ఖాయం అన్నది పార్టీ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. నాగబాబు తో పాటు మరో ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ ఇద్దరిలో తన పేరు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు విజయవాడకు చెందిన ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే. నిత్యం సీఎం వో లోనే ఆయన తెష్ట వేస్తున్నారట. తన వారిని పెట్టుకుని మంత్రివర్గంపై ఎప్పుడు ఎలాంటి సమాచారం బయటకు వచ్చిన వెంటనే తనకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది.
పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడ్డారని కీలక సామాజిక వర్గంలో తనను ఎంపిక చేయడం ద్వారా పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఇటీవల రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వద్ద కూడా సదరు ఎమ్మెల్యే చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు మీడియా మిత్రులను కూడా కాకా పడుతున్నారట .. తనకు అనుకూలంగా కథనాలు రాయాలని కోరుతున్నట్టు మీడియా లో చర్చ సాగుతోంది. గత అసెంబ్లీలో కొడాలి నానిని వేలు పెట్టి హెచ్చరించిన ఈ ఎమ్మెల్యే పార్టీలో ను ఫైర్ బ్రాండ్ గానే ఉన్నారు. అయితే ఈయనకు మంత్రివర్గంలో చోటు ఇస్తే సామాజిక సమీకరణల పరంగా ఆ సామాజిక వర్గం నుంచి ఎవరిని తప్పిస్తారు ? అన్నది కూడా చర్చ నడుస్తోంది. అయితే సదరు ఎమ్మెల్యేకు చంద్రబాబు దగ్గర మంచి మార్కులు ఉండడం తో ఏం జరుగుతుందో చూడాలి.