- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

రాజకీయాల అన్నాక అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు రాజకీయం అన్నాక అధికారంలో ఉండాల్సి ఉంటుంది .. ప్రతిపక్షంలో ఉండాల్సి ఉంటుంది. రాజకీయాల్లో పూలే కాదు .. రాళ్లు కూడా పడుతూ ఉంటాయి. పూలు పడినప్పుడు ఎలా చిరునవ్వులు చిందేస్తామో ..రాళ్లు పడినప్పుడు పంటి బిగువుతో ఆ బాధను అలాగే ఓర్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో వైయస్ కుటుంబం పై మీడియా అలాగే ప్రతి ప‌క్షాలు .. స్వపక్షం వాళ్ళు విమర్శలు చేయడం కొత్తమే కాదు. గత 15 - 20 సంవత్సరాలు నుంచి ఇది జరుగుతూ వస్తోంది. వైఎస్సార్ ఆ తర్వాత జగన్ కూడా ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ముందుకు సాగారు. అయితే 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత అసెంబ్లీకి వెళ్లి అవమానాలను భరించడానికి జగన్ నో అంటున్న పరిస్థితి. ఒక‌సారి అసెంబ్లీకి వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న జగన్ కు గౌరవం ఉంటుంది .. జనాల్లో క్రేజ్ పెరుగుతుంది .. అలా కూడా చేయటం లేదు.


అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన జగన్ తన వాళ్ళతో ప్రతిపక్ష హోదా కావాలని కొన్ని నిమిషాల పాటు నినాదాలు చేయించి ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటికి వచ్చేసారు. ప్రతిపక్షపాత ఇచ్చేది లేదని ఇప్పటికే కొన్నిసార్లు కూటమి ప్రభుత్వం చెప్పేసింది. అయినా ఏ వ్యూహంతో జగన్ అసెంబ్లీకి వెళ్లారు ? వైసీపీ నేతలకే తెలియాలి .. ఇదే జగన్ 2014 నుంచి 5 ఏళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా అద్భుతమైన పోరాట పెటిమా కనపరిచారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా అది కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఏమాత్రం అనుభవం లేని జగన్ అసెంబ్లీలో అప్పట్లో తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపించారు.


చంద్రబాబు ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా దిగిన ప్రతిపక్ష పాత్ర పోషించారు .. అసెంబ్లీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. అందుకే జగన్ పై ప్రజల్లో సానుభూతి వచ్చింది. చివరికి స్పీకర్ కోడెల శివప్రసాద్ తనకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని ఎన్నోసార్లు జగన్ అసెంబ్లీలో గొడవపడ్డారు. చివరకు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారాన్ని సొంతం చేసుకుని తన జీవితాశయం నెరవేర్చుకున్నారు. అయితే అదే 2024 కు వచ్చేసరికి జగన్కు అసెంబ్లీ అంటే భయం పట్టుకుంది .. అవమానాలను భరించడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్టు లేరు .. అందుకే జగన్ తీరు ఇప్పుడు సొంత పార్టీ నేతలకు కూడా ఎంత మాత్రం నచ్చటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: