
తాజాగా జీవి రెడ్డి రాజీనామా ఉదంతంతో తెలుగుదేశం సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు టీడీపీ సోషల్ మీడియా వీరాభిమానులు తమ క్రియేటివిటి కావచ్చు .. లేదా తమ ఆవేదన రూపంలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధకు ఎమ్మెల్సీ పదవి బాబు నిజంగానే ప్రేమతో ఇవ్వాలని ఇచ్చారా అంటే కాదు ఆమెకు పరిణామాలు కలిసి వచ్చి పదవి వచ్చిందన్న ఓ పోస్ట్ ఇంట్రస్టింగ్‌గా ఉంది.. వైరల్ అవుతోంది.
రాజకీయాల్లో అవకాశాలు చాలా రేర్ గా వస్తాయి. పంచుమర్తి అనురాధ అత్యంత చిన్న వయసులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి మేయర్ గా చేశారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ లో గొడ్డు చాకిరీ చేస్తున్నారు... మధ్యలో ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నా పట్టు వదలని విక్రమార్కు రాలిలా పోరాటం చేసి కోలుకుని మరీ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఆమె చేసిన చిన్న తప్పు ఏంటంటే 2014 లో ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీ ఇద్దాం అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అయితే అది 6 నెలల గడువు మాత్రమే ఉంది.. ఫుల్ టర్మ్ కాదు నాకు ఇస్తే ఫుల్ టర్మ్ ఎమ్మెల్సీ కావాలి అని రిజెక్ట్ చేశారు.
మళ్ళీ ఎమ్మెల్సీ అనిపించుకోవడానికి 8 యేళ్లు పట్టింది.. అది కూడా పార్టీ అపోజిషన్ లో ఉండటం వలన కలిసి వచ్చింది.. లేకపోతే పదవి వచ్చేది కాదని తెలుగుదేశం సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది. అంటే తెలుగుదేశంలో పార్టీ కోసం కష్టపడే నికార్సైన నాయకులకు గుర్తింపు ఉండదని ఆ పార్టీ వాళ్లు పెడుతోన్న పోస్టులే చెపుతున్నాయి. ఏదేమైనా జీవి రెడ్డి ఉదంతం తెలుగుదేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తోంది అన్నది నిజం.