
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ప్రతిపక్షంలో ఉంటే కార్యకర్తలు..నాయకులు కావాలి... కార్యకర్తలే నా బలం అంటారు.. అదే ఒక్కసారి అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే.. ఆయన చేతి లోకి పవర్ వచ్చిన వెంటనే ఆయనకు ఐఏఎస్ లు మాత్రమే గుర్తుకు వస్తారు.. ఇక వచ్చే ఎన్నికల్లోనూ ఐఏఎస్ లతోనే ఓట్లు వేయించుకోండి .. మీరు ఓడిన ప్రతి సారి ఓటమికి కారణం మీరు.. మీ నిర్ణయాల తోనే పార్టీ చాలా సార్లు ఓడిపోయింది... మీ గెలుపు నకు కార్యకర్తల కష్టం.. అభిమానుల కష్టమే ఇలా ఒకటి రెండు కాదు లక్షల్లో పోస్టులు తాజాగా సోషల్ మీడియా లో దర్శనమిస్తున్నాయి. టీడీపీ అభిమానులు జీవీ రెడ్డి రాజీనామా తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోయి మరీ పోస్టులు పెడుతున్న పరిస్థితి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ మరీ తెలుగుదేశం కార్యకర్తలే పోస్టులు పెడుతున్నారు అంటే బాబు , లోకేష్ తీరుపై జనాల్లో వ్యతిరేకత మొదలైంది .. ఇలాగైతే ఈ సారి కష్టమే అంటూ సిగ్నల్స్ పంపుతోన్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు ఎప్పటి నుంచో సోషల్ మీడియా లో తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు గా ఉన్న వారు సైతం రెచ్చి పోయి పోస్టులు పెడుతున్నారు. జీవి రెడ్డి కి సపోర్ట్ గా తమ మద్దుతు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ సారి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అని చెప్పారు అని..ఇదేనా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని కొందరు మండి పడుతున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఓటింగ్ కు వెళ్ళం అని కొంత మంది...నోటా కు వేస్తాం అంటూ మండి పడుతున్నారు. ఏదేమైనా జీవి రెడ్డి విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు ఈ స్థాయిలో వ్యతిరేకిస్తారని ఆయనే కాదు .. ఎవ్వరూ ఊహించి ఉండరు.