
కూటమి సర్కారుకు ..ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బిగ్ షాక్ అని చెప్పాలి. చాలా మంది రాజకీయ నాయకులు ఛైర్మన్ పోస్టు లేదా మరో పదవి దక్కించుకు నేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మక మైన ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవి దక్కించుకున్న జీవీ రెడ్డి తన పదవి ని తృణప్రాణంగా వదిలేసుకున్నారు. ఈ పదవితో పాటు టీడీపీకి కూడా ఆయన గుడ్ బై చెప్పారు. గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారం కలకలం రేపుతున్న విషయం అందరికి తెలిసిందే. వైసీపీ హయాంలో ఈ సంస్థలో అక్రమంగా నియమించిన కొందరికి ఇప్పటకి జీతాలు వెళుతున్నాయని .. వారిని తప్పించాలని .. అప్పుడే సంస్థ పని తీరు మెరుగు పడుతుందని.. ఈ క్రమంలోనే తాను నిర్ణయం తీసుకుంటే దానిని ఎండీ దినేష్ కుమార్ అమలు చేయకపోగా.. ఏ మాత్రం సహకరించటం లేదు.. దినేష్ చర్యలు రాజద్రోహం కింద వస్తాయి అంటూ జీ వి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా .. ఇవి పెద్ద దుమారం రేపాయి.
జీవి రెడ్డి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారులు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో ... చంద్రబాబు తో పాటు మంత్రి బీ సి జనార్దన్ రెడ్డి చైర్మన్ నుంచి వివరణ కోరడం.. జీవి రెడ్డి తన వివరణ ఇవ్వడం తెలిసిందే. అయితే ఈ విషయంలో జీవి రెడ్డిని మంత్రి తో పాటు చంద్రబాబు కూడా మందలించారని టాక్ ? దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన జీవి రెడ్డి తన పోస్ట్ తో పాటు టీడీపీ కి కూడా రాజీనామా చేయటం రాజకీయంగా టీడీపీ కి షాక్ లాంటిదే అని చెప్పొచ్చు. రాజీనామా చేసిన జీవి రెడ్డి పూర్తి గా న్యాయవాద వృత్తిలో కొనసాగనున్నట్లు తెలిపారు. ఒక్కటి మాత్రం నిజం .. జీవి రెడ్డి పదవి పోయినా ఆయన క్రేజ్ పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.