
జేపీ సంస్థకు చెందిన పంకజ్ గౌర్, నేవీ కి చెందిన మరికోస్, ప్రసాద్, ఆర్మీ కల్నల్ వికాస్, కల్నల్ సురేష్, మోర్త్ డైరెక్టర్ అన్షు కల్కు, NHIDCL (National highways infra dev) ,NDRF కమాండెంట్ ప్రసన్న, అగ్నిమాపక శాఖ రీజినల్ ఫెయిర్ ఆఫీసర్ సుధాకర్ రావు, హైడ్రా కు చెందిన పాపయ్య,SCCL అధికారి సదానందం,, ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ ర్యాట్ మైనర్స్ గ్రూప్ ప్రతినిధి ఫిరోజ్ కురేషి, నవయుగ కు చెందిన JVLN కుమార్, ఇతర ఉన్నతాధికారుల బృందం కూడా ఈ సహాయ చర్యల్లో పాల్గొంటోంది.
అయితే సొరంగం చివరి 40 మీటర్లలో నీరు, బురద మట్టి తో ఉందని ఏవిధమైన రాళ్లు, ఇతర ఘన పదార్థాలు ఉన్నట్టు కనిపించడం లేదని నిపుణులు స్పష్టం చేశారు. 15 అడుగుల ఎత్తులో, 200 మీటర్ల వరకు ఈ బురద ఉందని నిపుణులు అన్నారు. ప్రస్తుతం టన్నెల్ లో 10 వేల ఘనపుటడుగుల బురద ఉందని ప్రాధమికంగా అంచనా వేశామని, ఈ బురదనీటిని బయటికి తీయడమే ప్రధాన సవాలుగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. కన్వేయర్ బెల్ట్ కు మరమత్తులు జరుగుతున్నాయని, ఈ కన్వేయర్ బెల్ట్ కు రేపు లోగా మరమత్తులు పూర్తవుతాయని నిపుణులు తెలిపారు.
ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా గంటకు 800 టన్నుల ఘణపుతడుల బురదను బయటికి తీయ వచ్చని నిపుణులు అన్నారు. వీటిని మరింత త్వరిత గతిన వెలికి తీయడానికి అక్కడికి వెళ్లగలిగే జేసీపీ లను తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నామని నిపుణులు చెప్పారు. టన్నెల్ లో గంటకు 3600 నుండి 5000 లీటర్ల ఊట నీరు వస్తుందని నిపుణులు తెలిపారు. లోపలినుండి నీటితోపాటు, బురదను కూడా బయటికి తీయడానికి ఒకే పైప్ లైన్ వినియోగించనున్నామని నిపుణులు స్పష్టం చేశారు.