
వీరిని ఎలాగైనా శిక్షించి తీరాలని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే.. దీనిపై సిట్ వేసింది. అంతేకాదు.. మంగళగిరి కార్యాలయంపై జరిగిన దాడి కేసును సీఐడీ కి కూడా అప్పగించింది. ఆ వెంటనే హడావుడిగా కేసు ముందుకు సాగింది. పలువురు నాయకులను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్ పారిపోతుండగా.. బెంగళూరులో పట్టుకున్నామని పోలీసులు చెప్పడం కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఇక, ఇదే కేసులో ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంలను సీఐడీ అధికారులు పలుమార్లు విచారించా రు. అదేవిధంగా ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకుని విచారించినా.. ఈలోగా.. దేవినేని సహా.. జోగి రమేష్, లేళ్ల తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ వారికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో వారంతా.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు పలు షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది. మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీకి ఇది పెద్ద ఉపశమనంగా మారిందని నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. మరోనేత వల్లభనేని వంశీపై మరో భూకబ్జా కేసు నమోదు కావడం.. ఆయనను కస్టడీకి తీసు కోవడం.. చర్చనీయాంశం అయింది. ఇక, మండలిలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా.. వైసీ పీలో చర్చకు దారితీశాయి. ఎవరినీ వదల బోమని.. అరెస్టు చేసి శిక్షించి తీరుతామని ఆయన చెప్పుకొచ్చా రు. ఇలా.. కొన్ని ఇబ్బందులు.. మరోవైపుసుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ వంటివి వైసీపీ పరిణామాలను మారుస్తున్నాయి. ఏదేమైనా మంగళగిరి కేసులో మాత్రం.. వైసీపీకి కొంత ఊరట లభించిందనే అంటున్నారు.