పోసాని కృష్ణ మురళిని తాజాగా అన్న మీ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు .. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి గత 7 - 8 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు .. చూస్తూనే ఉన్నాం. ఇక తాను సన్యాసం తీసుకున్నానని ప్రకటించినట్లుగా పవన్ .. చంద్రబాబు .. లోకేష్ లపై అడ్డగోలుగా నోరు పారేసుకున్న వ్యక్తి తను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నానని తీర్థయాత్ర లు చేసుకుంటానని ప్రకటించి సైలెంట్ అయ్యారు. పోసాని ని అందరు వదిలేస్తారా ? అని ఆశ్చర్యపోయారు. అయితే అలా వదిలే ఛాన్స్ ఎంత మాత్రం లేదని పోలీసులు తెలిపారు. సమయం .. సందర్భం కలిసి రావాలి కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కడు అనుభవించాల్సిందే అని పోసాని ఉదంతం స్పష్టం చేస్తోంది. నిజానికి ఇలాంటి వాళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు
అయితే వీళ్ళని చూసి మరికొందరు రెచ్చిపోతున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. జగన్ ప్రభుత్వంలోనూ ఇలాంటి అరెస్టులు కేసులు చూశాం . . ఇప్పుడు కూటమీ ప్రభుత్వం రివెంజ్ తీర్చుకుంటుందా ? అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి పోసాని అరెస్టుతో ఈ కథ ఇక్కడితో ముగియదు .. ప్రస్తుతానికి జగన్ మోహన్ రెడ్డి కోసం వైసిపి కోసం ఆవేశపడి ఇతరులను ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన వారి అరెస్టులే జరుగుతున్నాయి. ముందు ముందు వీరు వ్యవహారంతో తీగ లాగితే డొంక కదులుతుంది అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యేలోపు చేయాల్సినవన్ని చేస్తోంది. గత ఎన్నికలలో దోపిడీలకు పాల్పడిన దారితప్పిన గత దాటిన వారందరికీ పనిష్మెంట్ ఇస్తోంది .. ఈ లిస్టులో రోజా - కొడాలి నాని - పేర్ని నాని ఇలా చాలామంది ఉంటారని కూడా కూటమి ప్రభుత్వ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయి.