
ఇటీవల దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అధిష్ఠానం తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన రేశా గుప్తాను ని సీఎంగా ప్రకటించింది. ఇది రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ సీఎంను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది.
ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖగుప్తా బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించాలని ఆరోపణలు చేసింది. దీన్ని మర్చిపోకముందే ఆప్ మరో సంచలన వీడియో బయటపెట్టింది. ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో 13 సెకండ్ల వీడియోను షేర్ చేసింది. “ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త నిద్రపోతున్నారని.. ఢిల్లీ ప్రజలకు సేవ చేయాలని అసెంబ్లీకి పంపిస్తే.. శాసనసభ సమావేశంలో జరుగుతుండగా ముఖ్యమంత్రి గారు నిద్రపోతున్నారని” విమర్శలు చేసింది.
“ముఖ్యమంత్రి గారు అంబేద్కర్, భగత్ సింగ్ ను అవమానించడంలో సమయం తీసుకున్నారు. ఆ సమయంలో కొంత భాగం అసెంబ్లీ చర్చలపై కూడా దృష్టి సారిస్తే ఢిల్లీ బాగుపడుతుంది. ఇకపై వాటిపై దృష్టి సారించాలని” వ్యాఖ్యానించింది. ఆప్ షేర్ చేసిన వీడియోలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖగుప్త కళ్ళు మూసుకునట్టు కనిపించారు.
ఆప్ నేతలు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కళ్ళు మూసుకున్న వీడియోని షేర్ చేసి.. నిద్రపోతున్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేసిన అరవింద్ కేజ్రీవాల్ కళ్ళు మూసుకున్న వీడియోలను.. నిద్రపోతున్నట్టుగా ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.. “ఇక్కడ నిద్రపోతున్న వ్యక్తి ఎవరో మీరు గమనించాలి.. అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఏం చేశాడో కూడా మీరు గమనించాలని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు..
ఒక మహిళా ముఖ్యమంత్రి కి కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఆప్ నేతలు ప్రవర్తిస్తున్నారని.. అధికారం కోల్పోయిన తర్వాత వారికి మతి భ్రమించిందని వ్యాఖ్యానిస్తున్నారు. మహిళకు బిజెపి గొప్ప స్థానం కల్పించింది. ఆమెను ముఖ్యమంత్రిని చేసింది. అలాంటి మహిళను పట్టుకొని ఆప్ నేతలు పిచ్చిపిచ్చి విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని” బీజేపీ నాయకులు కౌంటర్ ఇస్తున్నారు.