కూటమిలో జనసేన, టిడిపి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఆ రెండు పార్టీలు మాకు మేమే.. మీకు మీరే అన్నట్టుగా వ్యవహరించబోతాయి. పవన్ కళ్యాణ్ ద్వారా బిజెపి గేమ్ మొదలు పెడుతుంది. టిడిపిని  ఇరకాటంలో పడేస్తుందని ఇటీవల వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.  అయితే వీటిపై టిడిపి, జనసేన నేతలు స్పందించలేదు.  


తాజాగా జరిగిన శాసనసభ సమావేశంలో పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంపై స్పందించారు.  నన్ను తిట్టినా కొట్టినా.. 15 సంవత్సరాలు కూటమి ఏపీలో అధికారంలోకి వస్తుంది.  ఇందులో ఎటువంటి అనుమానం లేదు. గవర్నర్ కు గౌరవం ఇవ్వని పార్టీ శాసనసభలోకి ప్రవేశించకూడదు. అధికారంలోకి అసలు రాకూడదు.  ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము కలిసే ఉంటాం. కలిసే ప్రయాణం సాగిస్తాం.  ఒకటి కాదు, రెండు కాదు 15 సంవత్సరాలపాటు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాం.



ఇందులో నాకు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి.  ఎన్నో తిట్లు భరించాను. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున నేను పోరాడుతూనే ఉంటాను. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే ఉంటానని" పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  పవన్ కళ్యాణ్ శాసనసభలో మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి.  అంతేకాదు కూటమి కకావికలం అయిపోతుందని చెబుతున్నవారికి స్వచ్ఛమైన సమాధానం పవన్ కళ్యాణ్ మాటల ద్వారా లభించింది.


పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నంతసేపు శాసనసభలో నారా లోకేష్, చంద్రబాబు నాయుడు బల్లలు చరిచి తమ సంఘీభావాన్ని తెలిపారు.  మొత్తానికి మేమంతా ఒకటే అనే సంకేతాలు ఇచ్చారు.


ఇక వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాపపదాలుగా మారిపోయారని విమర్శించారు. ఇలాంటి నేతలను ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు తట్టుకొని నిలబడగలిగారా హ్యాట్సాప్ అంటూ కొనియాడారు. ఏది ఏమైనా 15 కలిసే ఉంటామని.. 2047 నాటికి ఏపీని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు అంతా కలిసే కృషి చేస్తామన్నారు. దీంతో తాము 15 ఏళ్లు  కలిసే ఉంటామనే స్ట్రాంగ్ మెసేజ్ ని మాత్రం పవన్ కల్యాణ్ పంపించేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: