తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టి అందరినీ మోసం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిలా పార్టీలు మారలేదని పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు.


ఇప్పటికే రేవంత్ రెడ్డి 3 పార్టీలు మారారని.. భవిష్యత్ లో 33 మారుతారు కావచ్చు అన్నారు. ఇంకా మూడేండ్లకు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికీ తెలియదని పైడి రాకేష్ రెడ్డి  అన్నారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ దండుకోవడానికి దక్షిణ భాగం రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చాలని చూస్తున్నారని పైడి రాకేష్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ మంత్రులు దీనికి ప్లాన్ చేశారన్నారు.


పేద ప్రజల భూమి పోయేలా అలైన్మెంట్ మార్చాలని వెళ్తే కేంద్రం ఒప్పుకోలేదని పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పేదల భూములు పోతాయంటే ససేమిరా ఒప్పుకోబోము.. అలైన్మెంట్ మార్చబోమని పైడి రాకేష్ రెడ్డి  స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డికి రాసిన లేఖ దిక్కుమాలింది అని పైడి రాకేష్ రెడ్డి  అన్నారు.


రేవంత్.. చేతకాని, చేవ లేని ముఖ్యమంత్రి అని పైడి రాకేష్ రెడ్డి  విమర్శించారు. కనీసం కేబినెట్ విస్తరణ చేపట్టలేని స్థితిలో ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అని పైడి రాకేష్ రెడ్డి  ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అవినీతికి కేంద్రం వత్తాసు పలకదన్న పైడి రాకేష్ రెడ్డి  కేంద్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ తెలంగాణ అభివృద్ధికే మొగ్గు చూపుతోందని తెలిపారు.


అభివృద్ధి అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని పైడి రాకేష్ రెడ్డి  డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారో చెప్పాలని పైడి రాకేష్ రెడ్డి  సవాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: