
- పోసాని , వంశీ ల విషయం లో జగన్ స్పీడ్ రియాక్షన్ .. !
- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . . .
సినీ నటుడు.. వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. పోసాని అరెస్టు అనంతరం ఆయన సతీమణి తో జగన్ మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. న్యాయపరంగానే కాకుండా.. అన్ని విధాలా తాము అండగా ఉంటామన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వంపై జగన్ నిప్పు లు జరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరంకుశ పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. తాము ఖచ్చితంగా 2.0 తో అధికారం లోకి వచ్చి కూటమి పార్టీ ల నేత ల అంతు చూస్తామంటున్నారు.
ఈ క్రమంలోనే జగన్ పార్టీకి చెందిన కొందరు నాయకులతో మాట్లాడి.. పోసానికి అన్ని విధాల సాయం అందించాలని సూచించారు. దీంతో కొందరు నాయకులు హుటాహుటిన పోసాని ఉన్న రాయిచోటి జైలుకు చేరుకుని.. ఆయనకు సాయం అందించే కార్యక్రమాలు ముమ్మారం చేశారు. ఇతర నాయకుల విషయంలో ఇంత వేగంగా స్పందించని జగన్.. పోసాని విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపించడం చర్చకి వచ్చింది.
దీనికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న పోసాని.. చంద్రబాబును గట్టిగా విమర్శిస్తూ తనకు సపోర్టుగా ఉండటం.. టాలీవుడ్ లో తనకు మద్దతు ఇస్తున్న వారిని కాపాడుకునే ప్రయత్నం చేయటం.. పైగా ఇటీవల వంశీకి సపోర్ట్ చేస్తున్న జగన్.. పోసానికి కూడా అండదండలు అందిస్తూ.. కమ్మ సామాజిక వర్గానికి తాను వ్యతిరేకం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే పోసానికి ఇంత గట్టిగా అండాదండ అందిస్తున్నారు.