
చిన్న చిన్న కష్టాలు ఉంటే సర్దుకుంటాయి.. వాటిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు.. మేము కలిసే ఉంటాము.. ఎప్పటికీ విడిపోము అంటూ అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వర్గాలలో బాగా చర్చకు వస్తోంది. మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో తామే అధికారంలో ఉంటామని కూడా పవన్ చెప్పారు. 2024 ఎన్నికలకు ముందు కమ్మ, కాపు సమాజాన్ని ఏకం చేయడం ద్వారా మెజార్టీ ఓటు బ్యాంకును తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో ఈ కూటమి సక్సెస్ అయింది.
దీనిని అడ్డుకునేందుకు వైసీపీ చాలా ప్రయత్నాలు చేసింది. కమ్మ , కాపు లు కలిస్తే రాజకీయంగా తమకు ఇబ్బందులు తప్పవని జగన్ సైతం గ్రహించారు. అందుకే ఈ రెండు వర్గాల మధ్య విబేధాలు కలిగించే లా రాజకీయాలు చేశారు. అయితే.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వ్యతిరేకత పెరిగిపోయిందని.. ఇది తమకు సానుకూలంగా మారుతుందని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో జనసేనకు టీడీపీ నేతలకు మధ్య జరుగుతున్న వివాదాలను కూడా వైసీపీ పెద్దవిగా చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది.. ఎన్ని వివాదాలు వచ్చినా జనసేన, టీడీపీ కూటమి విడిపోదన్న సంకేతాలు బలంగా ఇచ్చారు.
ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో కాపు సామాజిక వర్గాల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను గెలిపించకూడదు.. అందుకోసం తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా రాజకీయంగా కలిసి పనిచేస్తామని సంకేతాలు పవన్ నేరుగా ఇచ్చేశారు. ఈ బంధం ఇలాగే కొనసాగితే కమ్మ, కాపులతో పాటు.. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు వెన్నంటే ఉండే బీసీలు కూడా ఒకే తాటి మీదికి వస్తే.. ఈ బంధం చాలా దృఢంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.