
ఇక ఇప్పుడు తదుపరి సజ్జల రామకృష్ణారెడ్డి వంతు వచ్చేలా కనిపిస్తోంది. పోసాని తన వాంగ్మూలంలో సజ్జల పేరు చెప్పారు. దీంతో ఆయన అరెస్టు తప్పదనే వాదన వినిపిస్తోంది. దీనికి తోడు వైకాపా నేత, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైకాపా సోషల్ మీడియా గత కన్వీనర్ భార్గవరెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, వైకాపా సోషల్ మీడియా గత కన్వీనర్ భార్గవరెడ్డి శుక్రవారం అత్యవసరంగా పిటిషన్ వేశారు.
వీరిద్దరూ ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, వారి కుటుంబసభ్యులు, ఓ సామాజికవర్గంపై తాను అప్పట్లో ప్రెస్‌మీట్‌లలో, సామాజిక మాధ్యమాల్లో బూతులు తిట్టానని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి వాంగ్మూలంలో చెప్పారు. వీరిద్దరు చెప్పడం వల్లే విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలమిచ్చారు.
దీంతో సజ్జల, ఆయన కుమారుడు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదుచేసిన కేసులో తమను అరెస్ట్ చేస్తారనే ఆందోళన వీరిలో ఉంది. అందుకే వారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. ఈ కేసులో ఏ1గా ఉన్న పోసాని కృష్ణమురళి.. మా పేర్లను పోలీసుల ముందు వాంగ్మూలంలో చెప్పారని.. మేం అమాయకులమని.. మమ్మల్ని అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారని వారు అంటున్నారు.
కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా, మాకు ఈ నేరంలో పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవంటున్న సజ్జల.. రాజకీయ ప్రతీకారంతో మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికించేందుకు యత్నిస్తున్నారని కోర్టుకు చెప్పారు. గుంటూరు జిల్లాలో, పులివెందులలో మాకు శాశ్వత నివాసాలున్నాయని... తప్పించుకుపోయే ప్రశ్నే ఉత్పన్నం కాదని... అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతామని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందస్తు బెయిలు మంజూరు చేయాలని వారు కోర్టును కోరారు.