
తనకు గుండె నొప్పిగా ఉందని పోసాని కృష్ణ మురళి చెప్పడంతో ఆయన్ను రాజంపేట సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మొదట వైద్య చికిత్సలు చేసిన వైద్యులు.. ఎందుకైనా మంచిదని కడప పంపించమన్నారు. ఉదయం ములాఖత్ లో సబ్ జైల్లో పోసాని కృష్ణ మురళిని రాజంపేట వైసిపి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కలిశారు. ఎమ్మెల్యే కలిసి వచ్చిన తర్వాత కాసేపటికి పోసానిని ఆసుపత్రికి తరలించారు.
పోసాని కృష్ణ మురళి ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లిన జైలు సిబ్బంది.. అక్కడి వైద్యుల సూచనలతో పోసాని కృష్ణమురళిని రాజంపేట ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. చాతిలో నొప్పికి మెరుగైన వైద్య పరీక్షలు చేసేందుకు పోలీసులు రిమ్స్ కు తరలించారు. అప్పటికే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్ కు తరలించాలని సిఫారసు చేయడంతో కడపకు పోసాని కృష్ణ మురళిని తరలించారు.
అయితే.. అక్కడ పోసాని కృష్ణ మురళి డ్రామా బయటపడిందట. రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారంటే.. చాతి నొప్పి అని పోసాని డ్రామా ఆడారు.. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించాము..
తనకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలింది.. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని ధ్రువీకరించారు.. అందుకే పోసానని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నాం...అని చెప్పారు.