- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల పాలనలో ఎంతోమంది సాధారణ ప్రజలు విసిగిపోయారు. ఎన్నో ఆశలతో వైసిపి ప్రభుత్వాన్ని గెలిపించామని తమ ప్రియతమ నేత జగన్ ముఖ్యమంత్రిని చేసుకున్నామని అభివృద్ధిలో రాష్ట్రం దశా దిశ మారిపోతుందని తమ జీవితాలు బాగుపడతాయని ఎంతోమంది భావించారు. మరీ ముఖ్యంగా యువత కూడా తమకు ఉద్యోగాలు వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ ఐదేళ్లలో కేవలం సంక్షేమంపై దృష్టి పెట్టడం మినహా రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదు కేవలం సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్ ఉద్యోగాలు మినహా మిగిలిన ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. యువతలోనూ సాధారణ ప్రజలలోను జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.


ఈ క్రమంలోనే గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి ఏకంగా 164 సీట్ల భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర కీలక నేతలు అందరూ అవినీతితో పాటు నియోజకవర్గంలో దోపిడీకి గేట్లు ఎత్తేసిన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికి వారు భారీ ఎత్తున కమీషన్లు తీసుకోవడంతో పాటు నియోజకవర్గంలో సహజ వనరులను దోపిడీ చేయడం ప్రతి పనిలోనూ భారీగా కమిషన్ను తీసుకోవటం చిన్న చిన్న పనులకు కూడా చేయి తడపనిదే పనులు పూర్తి చేయకపోవడం కాంట్రాక్టర్ల ముక్కుపిండి మరియు డబ్బులు వసూలు చేయటం చేస్తున్నారని విమర్శలు తీవ్రంగా వచ్చేసాయి.


చిన్న చిన్న పనులతో పాటు మద్యం వ్యాపారాల నుంచి కూడా భారీ ఎత్తున కమీషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. సామాన్యుల కు చిన్న చిన్న పనులు కూడా అధికారుల నుంచి జరగటం లేదు .. దీంతో కూటమి ఎమ్మెల్యేలపై ప్రజల్లో అప్పుడే తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది.మ‌రి చంద్ర‌బాబు ఈ త‌ర‌హా నేత‌లు .. ఎమ్మెల్యే ల‌పై ఎలా దృష్టి పెట్టి కంట్రోల్ చేస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: