
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీగా ఉన్న జనసేన పార్టీ శ్రేణులలో ముసలం మొదలైంది. గత ఎన్నికలలో తమ అభిమాన హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించు కునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన పార్టీ శ్రేణులు అందరూ ఎంతో కష్టపడ్డారు. ఎన్నో ప్రార్థనలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రిగా చూస్తామని అనుకున్నారు. కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ తో అధికారంలోకి వచ్చింది .. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు జనసేన లో అన్ని పదవులు కాపు సామాజిక వర్గానికి దక్కుతున్నాయి. జనసేనకు ఇచ్చిన మూడు మంత్రి పదవులలో .. రెండు పవన్ కళ్యాణ్ , కందుల దుర్గేష్ ఇద్దరికీ దక్కాయి. వీరిద్దరూ కాపు వర్గానికి చెందిన నేతలు. ఇక కొత్తగా క్యాబినెట్ లోకి వస్తున్న పవన్ సోదరుడు నాగబాబు కూడా కాపు వర్గానికి చెందిన నేత.
ఇక జనసేనకు ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పదవి దక్కింది. జనసేన తొలి ఎమ్మెల్సీ గిడుగు హరిప్రసాద్ కాపు వర్గానికి చెందిన వారు. కాగా త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్న నాగబాబు కూడా ఇదే వర్గానికి చెందిన నేతకావడం విశేషం. జనసేనలో బీసీ నేతలతో పాటు ఎస్సీ నేతలు ... ఎస్టీ నేతలు కాపు సామాజిక వర్గం కాకుండా మిగిలిన వర్గాలకు చెందిన నేతలు అందరూ ఈ లెక్కన తమకు ఎప్పటికీ పదవులు వస్తాయి తమ రాజకీయ భవిష్యత్తు ఏంటి ? జనసేనను పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే తమ గతి ఏమవుతుందని ఆందోళనతో ఉన్నారు. మరి పవన్ పార్టీ లో మిగిలిన కులాల కు చెంది న నేతలకు కూడా పదువులు ఇస్తాడేమో ? చూడాలి.