తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలో ఫస్ట్రేషన్ పీక్స్ లో ఉందంటున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.. అందుకే ఆయన మోకాలికి  బోడి గుండుకు ముడివేసి మోసగించడం, వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారు. ముఖ్యమంత్రి కర్తవ్యం మరిచి ఎన్నికల రాజకీయాలలో మునిగితేలారని.. దుబ్బాక ఎమ్మెల్యే కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.



ప్రమాద స్థలానికి వెంటనే వెల్లాల్సింది ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. బాధ్యత మరిచి ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చిన సీఎం...  ఇప్పుడు ప్రతిపక్షం మీద,  నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.. నేను అబుదాబికి క్రికెట్ మ్యాచ్ లు చూడడానికి విహారయాత్రలకు, విలాసాలకు వెళ్లలేదు.. నేను అబుదాబీకి 21 న వెళ్తే... ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం 22 వ తేదీన జరిగింది.. హెలికాప్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరు అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.


ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి పోకుండా హైదరాబాదులో ఉన్నారు.. ప్రభుత్వంలో ఉండి కూడా బాధ్యత మరచి, కనీస మానవ విలువలు పాటించకుండా  ప్రవర్తించిన వారు నాపై విమర్శలు చేస్తున్నారు.. స్నేహితుని బిడ్డ పెండ్లి ఫంక్షన్ కు కుటుంబంతో వెళ్తే దానిమీద వక్ర వ్యాఖ్యలు చేస్తూ తమ కుత్సితబుద్ధి బయట పెట్టుకుంటున్నారు .. తన కర్తవ్యం విస్మరించిన ముఖ్యమంత్రి  తొమ్మిది రోజుల తర్వాత పోయి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.


ప్రతిపక్ష శాసనసభ్యునిగా నేను నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించానంటున్న మాజీ మంత్రి హరీశ్ రావు.. ప్రమాద సహాయక చర్యలకు తగిన గడువిచ్చిన  తర్వాత ప్రమాద స్థలానికి చూడడానికి పోయానని.. తాను రాకపోగా వెళ్లిన నన్ను అడుగడుగున నిర్బంధించిన ముఖ్యమంత్రి... ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: