
నిజానికి పాలమూరు బిడ్డలు పనిమంతులు... రేవంత్ రెడ్డికి మాత్రం మాటలు ఎక్కువ చేతలు తక్కువన్న హరీశ్ రావు.. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించే కాదు, ఏ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.. 68 శాతం కృష్ణ పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణ, 60 ఏండ్ల పాటు కృష్ణా జలాలు దక్కక అలమటించిందంటే అది ఎవరి పాపం?.. బంగారం పండే నల్లరేగడి భూములుండిన పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిన వంచకులు మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులేనని హరీశ్ రావు అన్నారు.
తెలంగాణను కరువు కాటకాల పాలు చేసి 60 ఏండ్లు ఘోర కలిని సృష్టించింది కాంగ్రెస్ అని.. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి అనడం జోక్ ఆఫ్ ద మిలీనియం.. జలయజ్ఞం ధనయజ్ఞమని నాడు మాట్లాడింది రేవంత్ రెడ్డే కదా.. శిలాఫలకాలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకొని, కనీసం భూసేకరణ కూడా పూర్తి దగాకోరు చరిత్ర కాంగ్రెస్ ది అంటూ హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నత్త నడక నడిచిన పనులను పరిగెత్తించి పూర్తి చేసింది బీఆర్ ఎస్ అని..
రివర్ వాటర్ పొలాలకు ఇచ్చి.. రివర్స్ మైగ్రేషన్ పాలమూరులో జరిగేలా చేసింది బీఆర్ఎస్.. ప్రాజెక్టుల పేరిట డబ్బులు దండుకోవడానికి ఈపీసీ విధానం తెచ్చి ఇష్టమున్నట్టు దోచుకుంది కాంగ్రెస్ నాయకులు అని హరీశ్ రావు విమర్శించారు.