ఎస్ఎల్బీసీ టన్నెల్ ను నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇది అనుకోకుండా జరిగిన దుర్ఘటన..  జరిగింది… ఇది అనుకొని ప్రమాదం.. ఇలాంటి విపత్తులు జరిగినపుడు రాజకీయాలకు అతీతంగా ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలి.. ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా… బాధిత కుటుంబాలపై సానుభూతి చూపించి వారిని ఆదుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు.

ఆర్మీ, టన్నెల్ నిపుణులు సహా 11 డిపార్ట్ మెంట్స్ సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయి .. వారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా.. టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేదు.. ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు..
కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారింది.. సోమవారం లోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు.

ఆ ఎనిమిది మంది లోపల ఎక్కడ చిక్కుకుపోయారో, ఎక్కడ మిషనరీ పాడైపోయిందో అధికారులు ఇంకా పూర్తిస్థాయి అంచనాకు రాలేదన్న సీఎం రేవంత్ రెడ్డి .. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశామన్నారు. ఇది ఒక విపత్తు… మనందరం ఏకతాటిపై నిలబడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా.. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ జనరేషన్ లో ప్రమాదం జరిగితే ఎవ్వరినీ అక్కడికి వెళ్లనివ్వలేదు.. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నేను వస్తే నన్ను జైల్లో పెట్టారు.. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఎక్కడ మరణించినా ఆనాడు ప్రభుత్వం విపక్షాలను అనుమతివ్వలేదు… ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడకు వెళ్ళలేదు.. కానీ ఇవాళ మేం ఘటన జరిగిన వెంటనే ఉత్తమ్ గారిని పంపి, కేంద్రంతో సమన్వయం చేసుకుని అన్ని సంస్థలను ఇక్కడికి రప్పించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి .



మరింత సమాచారం తెలుసుకోండి: