మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణ అప్పుల పాలైంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ హయాంలో ప్రాంతాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ది చేస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  కొనియాడారు.


తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్ట్ కు తాను విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో క్లియరెన్స్ రావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  అన్నారు. భూసేకరణ పూర్తయితే రెండున్నరేళ్లలో మామునూరు ఎయిర్ పోర్ట్ ను అత్యాధునిక సౌకర్యాలతో బ్రహ్మాండంగా అందుబాటులోకి తీసుకువస్తాం అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.


అయితే తెలంగాణ అప్పుల కుప్ప అయిందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు  వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. తెలంగాణ అప్పుల కుప్ప ఓకే.. మరి ఏపీ సంగతేంటన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కూడా పెద్ద ఎత్తున అప్పులపాలైంది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూాడా భారీగా అప్పులు చేస్తోంది. మరి తన సొంత పార్టీ  అధికారంలో ఉన్న ఏపీ సంగతి వదిలేసి.. కేవలం తెలంగాణను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.  


అదే సభలో రామ్మోహన్ మరికొన్ని ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర మంత్రి అయ్యాక తమ పార్టీ అదినేత చంద్రబాబు ఓ సూచన చేశారని... నువ్వు కేవలం ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పనిచేయకుండా, రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ది కోసం పనిచేయాలి అని సలహా ఇచ్చారని రామ్మోహన్ వెల్లడించారు. ఏపీ విమానయాన రంగం అభివృద్ధికి ఎంత కృషి చేస్తావో, తెలంగాణ విమానయాన రంగం అభివృద్ధి కోసం కూడా అంతే పాటుపడాలి అని చంద్రబాబునాయుడు చెప్పారు అని రామ్మోహన్ నాయుడు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: