రాష్ట్రం పరువు తీయవద్దని, ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలు సూచిస్తున్నారు.  2014 కు ముందు పాలమూరులో జూరాల మినహా ఇతర ప్రాజెక్టుల కింద ఇచ్చిన నీరు ఎంత? ఆ తర్వాత ఇచ్చిన నీరు ఎంత? అని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. వనపర్తి ప్రజలకు రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చిందేమీ లేదని... 1000 కోట్ల అభివృద్ధి అంటున్నారు, సున్నాలు ఎగిరిపోయి ఒకటి మాత్రమేనని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.


పనులు అవుతున్న వాటికే మళ్లీ శంకుస్థాపన చేయడం సీఎం పదవికే కళంకమని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, ఆసుపత్రికి కేసీఆర్ ఏనాడో శంకుస్థాపన చేస్తే... ఆసుపత్రి పనులు కళ్లెదుట కనిపిస్తుంటే బాగోదని, జూనియర్ కళాశాల వద్ద ఆసుపత్రి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఐటీ టవర్ సహా మిగతావి కూడా అంతేనని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి తెలిపారు.


వనపర్తిలో వచ్చిన మార్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరగలేదా అని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. వనపర్తి రాజకీయాలను ఎవరు కలుషితం చేశారో... రేవంత్ రెడ్డికి ఆదర్శప్రాయుడు ఆయిన చిన్నారెడ్డి మొన్ననే చెప్పారని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. సిలిండర్లు వచ్చాయా అని సీఎం అడిగితే రాలేదని మహిళలు కింది నుంచి చేతులు ఊపుతున్నారని... వెయ్యి కోట్లతో మూడు, నాలుగు నెలల్లో పూర్తయ్యే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.


వనపర్తి జిల్లా ఏర్పాటును ఎగతాళి చేసిన సీఎం రేవంత్ రెడ్డి... ఇపుడు అభిమానం అంటూ పెద్దగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలను కొనసాగించాల్సిందే... తీసివేస్తే ఊరుకునే వారు ఎవరూ లేరని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డితెలిపారు. కొడంగల్ - నారాయణపేట ఎత్తిపోతలపై లేని తొందర లగచర్ల భూములపై ఎందుకని మాజీ మంత్రి  నిరంజన్ రెడ్డి అడిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: