
మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. వీటిని 175 మందికి పంచనున్నారు. అంటే.. ఒక్కొక్క ఎమ్మెల్యేకు.. 35 ఓట్లు రావాల్సి ఉంటుంది. అంటే.. 35 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే.. సదరు ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం దక్కించుకుం టాడు. ప్రస్తుతం కూటమి పార్టీలకు 164 మంది ఉన్నారు. వైసీపీకి 11 మంది ఉన్నారు. వీరిలో స్పీకర్ ఓటును పరిగణనలోకి తీసుకోకపోయినా.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా గవర్నర్ నామినేట్ చేసే ఆంగ్లో ఇండియన్ కోటా ఒకటి ఉంటుంది. కానీ, ఈ స్థానంలో ఇప్పటి వరకు ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు.
గతంలో చంద్రబాబు పాలించిన 2014-19 మధ్య కాలంలోనూ.. తర్వాత వైసీపీ హయాంలోనూ గవర్నర్ నామినేట్ చేసే కోటాను ఎప్పుడూ ప్రస్తావించకుండానే సభను నడిపేస్తున్నారు. దీంతో మరో ఓటు కూడా ఇప్పుడు మైనస్ అవుతుంది. అంటే.. మొత్తం గా 13 ఓట్లు వరకు కూటమికి అవసరం ఉండగా.. అవి పూర్తిగాతగ్గనున్నాయి. పైగా.. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి ఓట్లుఎవరికి పడతాయి? అనేది కీలకంగా మారింది. వైసీపీ ఎలానూ పోటీ చేసే ఉద్దేశం లేదు. ఒకవేళ చేస్తే.. 11 మంది ఓట్లు వైసీపీ తరఫున బరిలో ఉండే అభ్యర్థికి పడే అవకాశం ఉంటుంది.
కానీ.. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. వైసీపీ ఎమ్మెల్యే కోటాలో పోటీ చేసేందుకుఅవసరమైన మెజారిటీ లేనందున పోటీకి దూరంగా ఉంటుంది. దీంతో ఆ 11 మంది ఓట్లలో ముగ్గురు.. పార్టీ అధినేత జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వీర విధేయులు కాబట్టి.. వారిని పక్కన పెడితే.. మిగిలిన 8 మందిలో ఐదుగురు కూటమికి అనుకూలంగా ఓటు వేస్తే.. ఐదు స్థానాలూ కూటమికే దక్కనున్నాయి. లేకపోతే.. ఒక అభ్యర్థి విషయంలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉందన్న అంచనాలు వస్తున్నాయి. దీంతో కూటమి ఆ ఒక్కస్థానం కూడా చేజారకుండా చూసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలకు కొందరు సీనియర్లు ఇప్పటి నుంచే టచ్‌లోకి వెళ్తున్నారని తెలుస్తోంది.