- ( హైద‌రాబాద్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


భారత రాష్ట్ర సమితి చాలా వ్యూహాత్మక తప్పిదాలతో నష్టపోతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భారతీయ జనతా పార్టీకి పరోక్ష మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఫలితంగా ఇప్పుడు టిఆర్ఎస్ ఉనికి బిజెపికి పెను సవాలుగా మారింది. టీచర్స్ .. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి లు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీకి పట్టపగ్గాలు ఉండవు. ఆ పార్టీ మొదటి టార్గెట్ బిఆర్ఎస్ .. ముఖాముఖి పోరును ఖరారు చేసుకునే దశలో బిఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడానికి చేయాల్సినంత చేస్తుంది . అందులో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బిఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఉద్యమానికి మద్దతుగా నిలబడిన బిజెపి ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో ఏడు స్థానాలు సాధించింది.


చాలా నియోజకవర్గాల్లో అక్కడ రెండో స్థానంలో నిలిచింది. అక్కడ తీవ్రంగా నష్టపోయింది బిఆర్ఎస్. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి దిగజారింది.. బిఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. అసలు బిఆర్ఎస్ ఒక్క ఎంపీ సీట్లు కూడా గెలుచుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బలం ఉన్న పోటీ చేయకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. పోరు బీజేపీ .. కాంగ్రెస్ మధ్య ఉందన్న వాతావరణం ఏర్పడింది. ఎలా చూసినా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం సమస్య కాదు.. అది ప్రత్యర్థి పార్టీ అవుతుంది కానీ బిజెపి అలా కాదు .. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకుని .. బీఆర్ఎస్ ను పూర్తిగా భూస్థాపితం చేసి కాంగ్రెస్ పార్టీతో హోరా హోరీగా పోరుకు సిద్ధం అవ్వాలని అనుకుంటుంది. తమ ఓటు బ్యాంకు బిజెపి వైపు వెళ్లకుండా చూసుకోవలసిన బాధ్యత బిఆర్ఎస్‌కు ఉంది కానీ బిఆర్ఎస్ అలా చేయకుండా బీజేపీకి మరింతగా సహకరిస్తున్న పరిస్థితి. ఇదే జరిగితే కారు పార్టీకి రెండు టైర్లు కూడా పంచరైన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs