మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పవన్ ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  కూటమి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ పై పెద్దగా వ్యాఖ్యానించని జగన్ తొలిసారి తన ప్రెస్ మీట్ లో జనసేన అధ్యక్షుడి ప్రస్తావన తెచ్చారు.  మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా పవన్ కార్పోరేటర్ కి ఎక్కువ. ఎమ్మెల్యేకి తక్కువ అని సెటైర్ వేశారు.  


వైసీపీ ఘోర ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు పవన్ మీద విమర్శలు చేయడం లేదు. పవన్ ని గత అయిదేళ్ళూ తామే అనవసరంగా విమర్శించి రెచ్చగొట్టి టీడీపీతో చేతులు కలిపేలా చేశామని చివరికి అదే తమకు ఓటమిని అందించింది అన్న చర్చ కూడా వైసీపీలో ఉంది.  మరో వైపు చూస్తే పవన్ ని పక్కన పెట్టి టీడీపీ మీదనే వైసీపీ విమర్శలు చేస్తోంది.  కానీ సడెన్ గా జగన్ పవన్ మీద చేసిన ఈ హాట్ కామెంట్స్ వేసిన పంచులతో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేగాయి.   పవన్ రాజకీయ రూపాన్ని ఆయన ఇమేజ్ ని తక్కువ చేసి జగన్ మాట్లాడారు అని జన సైనికులు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు.


ఇక ఈ వ్యాఖ్యలపై జనసైనికులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ వైసీపీని తూర్పార పట్టారు. ఇదిలా ఉంచితే టీడీపీ నేతలు సైతం పవన్ ను విమర్శించినందుకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నారా లోకేష్ మీడియా ముందుకు వచ్చి పవన్ కి అండగా నిలబడ్డారు.  పవన్ ని ఊరకే అంటే తాము సహించమని వైసీపీకి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి ఆయనకు వచ్చిన సీట్లూ ఓట్లు లెక్క చూసుకోండి అని వైసీపీకి సవాల్ విసిరారు


ఆయనను ఆయన పదవిని అవమానిస్తారా అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  జగన్ ఇలా అనగానే లోకేష్ అలా కౌంటర్ ఇవ్వడం ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చకు తావిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: