
ప్రధాని నరేంద్ర మోడీ గతంలో గుజరాత్ సీఎం అన్న సంగతి తెలిసిందే. మోడీ ఇంకా గుజరాత్ పై పక్షపాతం చూపుతున్నారని.. అహ్మదాబాద్ ను అభివృద్ధి చేస్తూ మిగిలిన నగరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మోదీ తీరును ప్రశ్నించారు. నేను ఒక్కటే సూటిగా చెప్పాలనుకుంటున్నా.. ఎవరిపై పక్షపాతం చూపొద్దు అంటున్నానన్న రేవంత్ రెడ్డి.. మోదీ గిఫ్ట్ సిటీ తీసుకెళ్లారు. ఎవరైనా విదేశీయుడు గిఫ్ట్ సిటీలో పెట్టుబుడులు పెడితే లాభాలు వాళ్ల దేశానికి తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఆ అవకాశం ఇవ్వలేదుని ప్రశ్నించారు.
మోదీ ఈ దేశానికి ప్రధానమంత్రి.. అలాంటప్పుడు గిఫ్ట్ సిటీకి ఎందుకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. . నేను ఈ మీడియా ద్వారా మోదీ, బీజేపీని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న.. మీరు గిఫ్ట్ సిటీలో పెట్టుబడులు పెట్టేవారికి ఎన్నో ప్రత్యేక అవకాశాలు, రాయితీలు ఇచ్చారు.. నిబంధనలు అతిక్రమించి గిఫ్ట్ సిటీలో ప్రయోజనాలు కల్పిస్తున్నారు.. హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వరు. గిఫ్ట్ సిటీలో యూనివర్సిటీ, పరిశ్రమ ఏ పెట్టుబడి వచ్చినా లాభాలు ఆయా దేశాలకు తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు.. హైదరాబాద్‌కు ఆ అవకాశం ఎందుకు ఇవ్వరు అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
మోదీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవన్న రేవంత్ రెడ్డి.. నేను మోదీ విధానాలతో విభేదిస్తున్నా. మోదీ దేశానికి ప్రధానమంత్రి ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఆయనను కలిసి మా రాష్ట్రానికి కావల్సినవి అడగడం నా హక్కు, బాధ్యత.. ప్రజలు నాపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రి చేశారుని అన్నారు. దీంతో యాంకర్ . మీరు ప్రధానమంత్రి మోదీ, గుజరాత్‌పై దాడి ప్రారంభించారు కదా అని కామెంట్ చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ గురించి మాట్లాడుతుంటే మీరు తెలంగాణ మోడల్ గురించి చెబుతున్నారు. తెలంగాణ వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు.. ఆయనది అబద్ధం మీది విజన్ అంటున్నారు...ఎలా అని ప్రశ్నించారు.