కెనడాపై టారిఫ్ లు విధిస్తూ ఇటీవల ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది కాస్త రాజకీయంగా దుమారం లేపినప్పటికీ ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.  అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఓహ్ కెనడా అంటూ.. ఓ ఫోటోను తన సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. ఆ ఫోటో పోస్ట్ చేయడం వెనక అసలు ఉద్దేశం ఇదేనని ఇప్పుడు తెలిసింది.   కీలకమైన అంశాలను కెనడా ప్రధానమంత్రి, మెక్సికో అధ్యక్షురాలు లేవనెత్తడంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు.


సుంకాల విధింపు పై ఒక నెలపాటు సమయం ఇస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత టారిఫ్ లు యధావిధిగా అమలు అవుతాయని ట్రంప్ ప్రకటించారు.  ఈ నిర్ణయాన్ని మెక్సికో అధ్యక్షురాలు స్వాగతించారు. దీనివల్ల ప్రాంతీయ ఆర్థిక సంబంధాలు బలోపేతం అవుతాయని.. మెక్సికో ఎగుమతిదారులు ట్రేడ్ ఫ్రేమ్ వర్క్ మార్చుకోవడానికి ఇది సహకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.  ఈ ఒప్పందం బయట ఉండే వారు మాత్రం సుంకాలు చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు.


ట్రంప్ టారిఫ్ లు విధించిన నేపథ్యంలో కెనడా ప్రధానమంత్రి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.  మరికొద్ది రోజుల్లో ఆయన తన పదవి నుంచి వైదొలిగి పోతారు. ఈ సమయంలో ఆయన కన్నీటి పర్యంతం కావడం ఒకసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. .” నాకు కెనడా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. నా పదవి చివరి రోజుల్లో కూడా ప్రజలను దూరంగా పెట్టలేదు. వచ్చే కాలంలో కెనడా ప్రజలను వదిలిపెట్టేది లేదని” ట్రుడో వ్యాఖ్యానించాడు.


టారిఫ్ లపై ట్రంప్ ఒక నెలపాటు ఊరట ఇచ్చిన నేపథ్యంలో ట్రూ డో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. పశ్చిమ ఆసియా దేశాలలో నెలకొన్న సంక్షోభాలు.. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పడటం వంటివి కష్టకాల సమయాలు. కెనడా ప్రజలకు సేవ చేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను. ట్రంప్ విధించిన టారిఫ్ లు అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయి. కాకపోతే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటప్పుడు కెనడా ప్రజలు సంఘటితంగా ఉండాలి. ఆర్థిక శక్తిని బలోపేతం చేసుకోవాలి. కెనడాను ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూపించుకునేలాగా కష్టపడాలని” ట్రూడో వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: