దిల్లీలో ఇటీవల బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.  అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అధిష్టానం రేఖ గుప్తాను ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేసింది.  ఈ సందర్భంగా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఇప్పటికే పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. 


ముఖ్యమంత్రిగా పరిపాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రేఖా గుప్త ఢిల్లీలో తన మార్కు చూపించడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల సమయంలో బిజెపి అనేక వాగ్దానాలు ఇచ్చింది. అందులో మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని ప్రకటించింది. వార్షిక ఆదాయం 2.5 లక్షల వరకు ఉన్న 18 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ప్రతినెల 2500 ఇస్తామని వెల్లడించింది. దీని ద్వారా ఢిల్లీ ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం 5,100 కోట్ల భారం పడుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి.. ప్రత్యేక పోర్టల్ తీసుకొస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.


మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఇకపై ప్రతినెల మహిళల ఖాతాలో 2,500 జమ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.


మహిళలకు గుడ్ న్యూస్ అంటూ రేఖ గుప్త ఈ శుభవార్త చెప్పారు.  ఈ పథకానికి మహిళ సమృద్ధి యోజన అనే పేరు పెట్టారు. దీనిని క్యాబినెట్ ఆమోదించిందని ఆమె వెల్లడించారు. ఈ పథకం ద్వారా 5100 కోట్ల భారం ప్రభుత్వ మీద పడుతున్నప్పటికీ.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఈ పథకం అమలు కోసం త్వరలోనే రిజిస్ట్రేషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా పోర్టల్ అందుబాటులోకి తీసుకొస్తాం. ప్రతిపక్షాలు విమర్శలు చేసినంత మాత్రాన మేము మహిళల సంక్షేమాన్ని పక్కనపెట్టం. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కచ్చితంగా నెరవేర్చుదాం. ఆ దిశగానే మేము అడుగులు వేస్తామని” రేఖ గుప్తా పేర్కొన్నారు.


ఇక ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లోను మహిళలకు  నగదు బదీలీ చేస్తామని తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దీనిపై కార్యచరణ రూపొందించడం లేదు. దిల్లీలో మాదిరిగా ఇక్కడ కూడా నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని తెలుగురాష్ట్రాల మహిళలు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: