
ఎందుకో గాని ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటోన్న నిర్ణయాలు ఆ పార్టీ కేడర్ కు .. ఆ పార్టీ వీరాభిమానుల కు ఎంత మాత్రం రుచించడం లేదు. నాగబాబుకు జనసేన కోటాలో ఎమ్మెల్సీ .. చంద్రబాబు కేబినెట్లోకి తీసుకోవాలని అనుకోవడం ... జీవి రెడ్డి రాజీనామా తాజాగా బీజేపీ కోటాలో సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం అసలు టీడీపీ వీరాభిమానులకు ఎంత మాత్రం నచ్చడం లేదు. దీంతో వారు సోసల్ మీడియా వేదికగా చంద్రబాబు , లోకేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు.
గతంలో యర్రం నాయుడు - మాధవ్ రెడ్డి - కోడెల శివప్రసాద్ రావు - కోటగిరి విద్యాధర రావు -
అశోక్ గజపతి రాజు - దేవేంద్ర గౌడ్ - కే ఈ కృష్ణమూర్తి - పరిటాల రవి - దేవినేని వెంకటరమణ - తుమ్మల నాగేశ్వర రావు - అయ్యన్న పాత్రుడు - gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి - మండవ వెంకటేశ్వర రావు - కడియం శ్రీహరి - కొత్తకోట దయాకర్ రెడ్డి - నాగం జనార్దన్ రెడ్డి - జీఎంసీ బాలయోగి ఈ నాయకులు అందరూ
చంద్రబాబు గారి టీమ్ లో ఉండేవారు. చంద్రబాబు అప్పట్లో నడిపిన ప్రభుత్వం గురుంచి ఈ రోజుకి మాట్లాడుకుంటారు ఎందుకంటే ఆయన టీమ్ అలాంటిది అని .. వీళ్ళు అందరూ అన్నగారి నుంచి నిజాయితీ, బాబుగారు నుంచి కష్టపడి పనిచెయ్యటం నేర్చుకున్నారు అని .. కానీ ప్రస్తుతం ఉన్న యువ నాయకులు లో ఈ స్థాయి కల నాయకుడు ఒక్కడున్నారా ? అన్న ప్రశ్నలు టీడీపీ కేడర్ నుంచే వినిపిస్తున్నాయి.
అసలు అలాంటి నాయకులకి అవకాశాలు ఇస్తున్నారా ? అన్న ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు అందరూ గోడ దూకే రకాలే అని అలాంటి వాళ్లనే చంద్రబాబు .. లోకేష్ నమ్ముతున్నారని .. వారికే అవకాశాలు ఇస్తున్నారని పార్టీ వీరాభిమానులు ఆరోపిస్తున్నారు.
చెట్టు పేరి చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అని .. ఇలా అయితే పార్టీ నష్టపోవడం ఖాయమన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.