
2024 ఎన్నికలలో మహిళలు అందరూ కూటమి సర్కారు కావాలి .. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని ఎక్కువగా కోరుకున్నారు. మహిళల ఓట్ల పై జగన్ ముందు నుంచి బాగా నమ్మకం పెట్టుకున్నారు. అయితే మహిళలు కూడా మెజార్టీ శాతం కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చెప్పారు. అది పవన్ కళ్యాణ్ వల్ల కావచ్చు .. చంద్రబాబు వల్ల కావచ్చు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎక్కువమంది మహిళలు కోరుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయిందో లేదో అప్పుడే వాళ్లలో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వం పట్ల .. మహిళల ఓట్ల లక్ష్యంగా కూటమి భారీగా హామీలు ఇచ్చింది. ఆ మహిళలు ఇప్పుడు చంద్రబాబు సర్కారుపై పోరుబాట పట్టారు. మూడు రోజుల క్రితం ఆశ వర్కర్లు ... నిన్న అంగనవాడి ఉద్యోగులు ఛలో విజయవాడ అంటూ సమస్యలు పరిష్కారం కోరుతూ విజయవాడ లో పోరు బాట పట్టారు. ప్రభుత్వం ఎంతగా అణిచివేయాలని ప్రయత్నించిన ఆశ వర్కర్లు ... అంగన్వాడి ఉద్యోగులు పోరు కేకను ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది.
వీళ్లంతా మహిళలు కావడానికి ప్రభుత్వ పెద్దలు గ్రహించాల్సిన అవసరం ఉంది. తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది. అయితే సామాన్య మహిళలను ఇదే రకమైన ఆగ్రహం ఉంది. సామాన్య మహిళలు ఉద్యోగ మహిళల కంటే ఎక్కువ కోపమున్నా దాన్ని ప్రదర్శించడానికి వీలులేని పరిస్థితి. ఎందుకంటే వాళ్లంతా ఎవరికి వారు విడివిడిగా ఉన్నారు. సామాన్య మహిళలకు కూడా లబ్ధిదారుల యూనియన్లు ఉండి ఉంటే ఈపాటికి వారు కూడా ఏ అమరావతి లోనోను ధర్నాలు ... ఆందోళనలు చేసేవారు. మహిళలకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేరలేదు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతినెల 1500 రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో బాగా హైలెట్ చేశారు ... ఇవన్నీ ఎలా ప్రచారం చేసుకున్నారో చూశాం. దీనికి తోడు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఎప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పుడు నెరవేరినా అది కూడా జిల్లాల వరకే అంటున్నారు. ఇలా సాధారణ మహిళలలో కూడా ప్రభుత్వం పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంది.