
వ్యక్తిగతంగానే కాకుండా.. పార్టీ పరంగా కూడా.. జగన్ ఇప్పుడు అత్యంత విషమ పరీక్షను ఎదుర్కొంటున్నా రు. పార్టీని అభివృద్ది చేయాల్సి ఉంది. అంతేకాదు.. పార్టీని నిలబెట్టాల్సిన, గ్రామ స్థాయిలో పార్టీని తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఈ క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు చాలానే ఉన్నాయి. కానీ, జగన్ ఇప్పుడు అనుసరిస్తున్నది, గతం నుంచి కొనసాగిస్తున్నదీ.. సింగిల్ అజెండా! తనను చూసి.. తన ఫేస్ వాల్యూను చూసి.. ఓటేస్తారన్న ఏకైక అజెండానే ఆయనను ఇబ్బంది పెడుతోంది.
అంతేకాదు.. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా వ్యవహరించడం కూడా.. జగన్ రాజకీ యాలపై అనేక మరకలు పడేలా చేసింది. అధికారంలో ఉన్నప్పుడు.. లేనప్పుడు కూడా.. జగన్ సింగిల్ పాయింట్ అజెండానే అనుసరిస్తున్నారు. దానినే పట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. వాస్తవా నికి.. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. సింగిల్ అజెండా కంటే.. బహుముఖ వ్యూహంతో ముందుకు సాగాల్సి ఉంది.
అవసరం-అవకాశం.. ఒకప్పుడు నాయకులను, పార్టీలను వెతుక్కుంటూ వచ్చేవి. కానీ, ఇప్పుడు వాటినే వెతుక్కుంటూ నాయకులు పరుగులు పెట్టాల్సిన పరిస్తితి ఏర్పడింది. కాబట్టి.. జగన్ సింగిల్ పాయింట్ అజెండా కాదు. గత తన పాలనలో చేసిన సోషల్ ఇంజనీరింగ్ విఫలం కావడం.. ఉచిత పథకాలు ఫెయిల్ కావడం. వంటి అన్ని పరిణామాలపైనా దృష్టి పెట్టాలి.రాజకీయాలను రాజకీయాలుగానే చేయాలి తప్ప.. మరో మార్గం అంటూ వెతికితే.. మరో దారిలో నడిస్తే.. మంచిది కాదన్న విషయాన్ని గ్రహించాలి.