
అంతేకాదు.. సదరు నాయకుడి వివరాలు కూడా బయటకు రాకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించా రు. ఆయన మాజీ మంత్రి, సీమ జిల్లాలకు చెందిన నాయకుడు అని మాత్రమే ప్రచారంలో ఉంది. దీంతో మరెవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ నుంచి ముగ్గురు.. గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీలు మాత్రమే నామినేషన్ వేయగా, జనసేన నుంచి అందరికన్నా ముందు నాగబాబు సమర్పించారు. ఇక, బీజేపీ తరఫున సోము వీర్రాజు చివరి నిముషంలో నామినేషన్ వేశారు.
దీంతో ఈ ఐదుగురు తప్ప మరొకరు నామినేషన్ వేసిన పరిస్థితి లేదు. వాస్తవానికి వైసీపీ ఒక సీటుకైనా నామినేషన్ వేస్తుందని అనుకున్నారు. కానీ, చివరి నిముషం దాకా ఊగిసలాడినా.. పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి మొగ్గు కనిపించలేదు. దీంతో నాయకులు ఉసూరు మంటూ తప్పుకొన్నారు. ఇక, ఈ రోజు(13 వతేదీ) సాయంత్రం 4 గంటలకు ఏకగ్రీవాలను ప్రకటించనున్నారు. దీంతో ఐదుగురు కూడా సాధ్యమైనంత త్వరలోనే ఈ సభల్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సభలు ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం మం చి రోజు కావడంతో ఆ వెంటనే వారి ప్రమాణ స్వీకారం ఉంటుందన్న ప్రచారం ఉంది. దీంతో ఐదుగురు సభలోకి అడుగు పెట్టనున్నారు. ఈ పరిణామం కూటమికి మరింత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి. సభలో ఆ పార్టీలకు వాయిస్ పెరగడంతోపాటు.. బలమైన మద్దతు కూడా లభించనుంది. ఇది వైసీపీపై ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.