మెగా బ్రదర్, జనసేన అధినేత నాగబాబు మంత్రి పదవికి సంబంధించిన ఏ వార్త అయినా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ తో సంచలనం సృష్టించిన నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడం ద్వారా జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని భవిష్యత్తులో ఎక్కువ సంఖ్యలో స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని జనసైనికులు భావిస్తున్నారు.

 
నాగబాబు ఎమ్మెల్సీ కావడానికి చాలా సమయం పట్టగా ఆయనకు మంత్రి పదవి దక్కాలని అభిమానులు కోరుకుంటున్నా ఈ పదవి దక్కడానికి మరింత సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణకు సమయం ఉండటంతో నాగబాబుకు పదవి దక్కాలంటే మరో ఏడాదిన్నర ఎదురు చూడాల్సిందేననే ప్రచారం జరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

 
నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కడంపై, పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన కామెంట్లపై టీడీపీ అభిమానుల్లో ఒకింత అసంతృప్తి ఉంది. నాగబాబుకు మంత్రి పదవి ఆలస్యం కావడానికి ఇవి కూడా ఒక విధంగా కారణాలని చెప్పవచ్చు. అయితే పవన్ జోక్యం చేసుకుంటే మాత్రం నాగబాబుకు ఏ క్షణమైనా మంత్రి పదవి లేదా అందుకు సంబంధించి అధికారికంగా హామీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

 
మరో 15 సంవత్సరాల పాటు టీడీపీ జనసేన బంధం కొనసాగాలంటే చంద్రబాబు సైతం జనసేన నేతలకు ఎక్కడా అన్యాయం జరగకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. టీడీపీ జనసేన మైత్రీ ఇదే విధంగా కొనసాగితే రాష్ట్రంలో వైసీపీ పుంజుకునే అవకాశాలు కూడా లేనట్టేనని చెప్పవచ్చు. చంద్రబాబు ఇరు పార్టీల నేతల మెప్పు పొందడానికి ఒకింత చాకచక్యంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. నాగబాబు మాత్రం ప్రస్తుతం మంత్రి పదవి విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. అయితే టీడీపీ జనసేన పొత్తు వల్ల అన్ని అర్హతలు ఉన్న కొందరు నేతలకు అన్యాయం జరగడం మాత్రం వాస్తవమేనని చెప్పవచ్చు. భవిష్యత్తులో నాగబాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు సైతం మెండుగా ఉన్నాయని పొలిటికల్ వర్గాల బోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి: