
ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపి శ్రీ క్రిష్ణ దేవరాయలు.. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపి హామీ ఇచ్చారు.. 2020లో గురజాల డిఎస్పీ, సిఐ లకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు.. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండని విడదల రజిని అన్నారు.
ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి ఎంపిని ప్రశ్నించారని.. అప్పటి నుండి ఎంపి నాపై కక్ష పెంచుకున్నాడని.. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారని.. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పిగా ఉన్న శ్రావణ్ టిడిపి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు.. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండని విడదల రజిని అన్నారు.
అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మని లో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారన్న విడదల రజిని.. నా మామ కారుపై దాడి చేయించారు.. ఎవరూ ఎటువంటి వాళ్ళో అందరికి తెలుసు.. నా కళ్ళలో భయం చూద్దామనుకుంటున్నారు.. ఇటువంటి వాళ్ళను చూస్తే నాకు భయమనిపించదన్నారు.
లావు రత్తయ్య అంటే నాకు గౌరవమన్న విడదల రజిని.. మా ప్రభుత్వంలో వైజాగ్ లో భూములను ఎంపి శ్రీక్రిష్ణ దేవరాయలు కారుచౌకగా కొట్టేశారని.. ప్రస్తుతం కూడా చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని విడదల రజిని ఆరోపించారు.