అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.  ఇప్పడు ఆ జాబితాలో మరో నిర్ణయం చేరింది.  ఓ తాలిబాన్ కీలక నాయకుడికి స్వేచ్ఛ ప్రకటించారు. విముక్తి  కల్పించారు.  గతంలో ఆయనపై విధించిన క్వాష్ రివార్డును ఎత్తి వేశారు. ఈ సమయంలో తాలిబాన్ కీలక నాయకుడి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.



తాలిబాన్ కీలక నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీపై గతంలో 10 మిలియన్ డాలర్ల బహుమతిని అమెరికా ప్రకటించింది.  ఎవరైనా సరే అతడిని పట్టిచ్చినా.. లేదా, అతడు ఎక్కడున్నాడనే సమాచారాన్ని తెలియజేసినా ఈ రివార్డు దక్కించుకోవచ్చని తెలిపింది.  తాలిబన్ల చెరలో ఉన్న తమ దేశస్తుడిని విడుదల చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  తాజాగా ఆ రివార్డును ట్రంప్ సర్కార్ ఎత్తేసింది. తమ చెరలో ఉన్న దేశస్తుడిని విడుదల చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖనీ తెలిపారు.  



వాస్తవానికి 2008లో ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ లోని సెరెనా హోటల్ లో అమెరికా పౌరుడు డేవిడ్ హెస్లాతో పాటు ఆరుమంది మృతికి  హక్కానీ ప్రధాన సూత్రధారి.  ఆ తర్వాత అతన్ని హిట్ లిస్ట్ లో చేర్చింది అమెరికా.  ఈ నేపథ్యంలో.. రెండేళ్లుగా అమెరికా చెరలో మగ్గుతున్న అమెరికా  పౌరుడు జార్జ్ గ్లెజ్మాన్ ను రిలీజ్ చేసినట్లు ఆఫ్గన్ ప్రభుత్వం తెలిపింది.  


గత వారమే అతనికి విముక్తి కల్పించినట్లు పేర్కొంది. దీని తర్వాత సిరాజుద్దీన్ పై విధించిన నగదు బహుమతిని అమెరికా ఎత్తేసింది. ఈ చర్చలకు ఖతర్ మధ్యవర్తిత్వం వహించగా.. జార్జ్ ని విడిపించడానికి రంగంలోకి దిగిన ట్రంప్.. హక్కానీ విషయంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.  మరి ట్రంప్ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: