జగన్ ను దెబ్బ కొట్టే ఏ ఒక్క అవకాశాన్ని చంద్రబాబు వదులుకోవడం లేదు.  జగన్ ను బలహీనం చేసి ఇక ఏ ఎన్నికల్లోను ఆయన గెలవకూడదని ఆయన భావిస్తున్నారు . తద్వారా తమ కూటమికి ఎదురు లేకుండా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు.  ఇప్పటికే వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి.  పార్టీ ముఖ్య నేతల్ని లాగేస్తున్నారు. కేసులు పెట్టి కీలక నేతల్ని సైలెంట్ చేస్తున్నారు.  


టీడీపీ నేతలు కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా మే నెలలో టీడీపీ మహానాడు ఈసారి కడపలో నిర్వహించాలని తాజాగా జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.   అయితే వాస్తవానికి రాయలసీమలో వైసీపీకి ఆది నుంచి బలమైన పట్టుంది.  సీమ ప్రాంతం వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిని ఓడించేందుకు షర్మిళ విఫలయత్నం చేసి ఓటమి పాలయ్యారు. కానీ కడప జిల్లాల్లో మాత్రం కూటమి పార్టీలు అద్వీతయ ఫలితాలు రాబట్టింది.  ఈ నేపథ్యంలో పులివెందులలో మహానాడు నిర్వహించేలా కడప జిల్లా టీడీపీ నేతలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.  


ఇక చంద్రబాబు సైతం మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం  నడుస్తోంది.  పార్టీలో కీలక నాయకులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు పొలిట్ బ్యూరో సభ్యులను మారుస్తారు అని నడుస్తోంది.  పార్టీ భవిష్యత్తు ప్రణాళికను ఖరారు చేసి శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.  మహానాడు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించి.. సక్సెస్ చేయటం ద్వారా కేడర్ లో జోష్ మరింత పెరుగుతుందనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది.  దీనిని విజయవంతం చేయాలని తమ్ముళ్లు కూడా పట్టుదలగా ఉన్నారు.  సమయంలో జగన్ ను మానసికంగా దెబ్బకొట్టడంతో ఆ పార్టీలో ఒక అభద్రత భావం కల్పించవచ్చని ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది తెలుగు తమ్ముళ్లకు ఎంత మైలేజ్ తీసుకు వస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: