- ( అమరావతి - ఇండియా హెరాల్డ్ ) . . .
కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గవర్నర్ పోస్టులను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను మార్చనున్నట్లు తెలుస్తోంది. వీటిలో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఒడిశా, ఢిల్లీ పేర్లు ఉన్నాయి. ఆ రాష్ట్రాల గవర్నర్ల పదవీకాలం పూర్తి కావడం ఒక కారణమైతే . . కేంద్రంలోని కూటమి సర్కార్‌కు భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జేడియు , టిడిపి , జనసేన నుంచి కూడా ఉత్తర్వులు పెరుగుతున్నాయి. దీంతో కొందరికి కాలం తీరకుండానే పక్కన పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు .. జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే కొందరికి కొత్తగా గవర్నర్ పదవులు దక్కనున్నాయి. తమిళనాడుకు చెందిన మాజీ గవర్నర్ .. తమిళ సై ను తిరిగి తెలంగాణకు గవర్నర్గా పంపే అవకాశం కల్పిస్తుందని జాతీయ మీడియా చెబుతోంది. ఆమె మొన్న ఎన్నికల్లో బీజేపీ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, జనసేనకు కూడా గవర్నర్ పదవులు దక్కనున్నాయని అంటున్నారు. టిడిపి జాబితాతో వచ్చేసరికి యనమల రామకృష్ణుడు ఈ జాబితాలో ముందు ఉన్నారు.
అయితే పార్టీలో ఆయనకు కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో .. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి రెండు గవర్నర్ పదవులు దక్కితే.. ఇవి ఇద్దరికీ దక్కుతాయని.. లేకపోతే అశోక గజపతికి గవర్నర్ పదవి ఖాయం అన్న చర్చ నడుస్తోంది. ఇక జనసేనకు ఒక గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. బిజెపి వాయిస్ వినిపిస్తున్న పవన్‌ను ప్రోత్సహించే క్రమంలో కీలకమైన గవర్నర్ పదవి జనసేనకు చెందినవారికి ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.