సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిబంధనలు, సంప్రదాయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని హరీశ్ రావు విమర్శించారు. న్యాయస్థానంలో ఉన్న అంశాలపై సభలో మాట్లాడకూడదని, అయినప్పటికీ సీఎం పది మందిని కోర్టులు ఏమీ చేయలేవని అన్నారని హరీశ్ రావు ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై ముఖ్యమంత్రి తీర్పు ఇచ్చారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టేనని హరీశ్ రావు ఖండించారు.సభలో నిరసన తెలిపేందుకు తమకు అవకాశం ఇవ్వలేదని, దీంతో నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసినట్టు హరీశ్ రావు వెల్లడించారు.


ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, ఎమ్మెల్యేలు వెనక్కు పోతారనే అనుమానంతోనే సీఎం ఉప ఎన్నికలు రావని అన్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నీ గోబెల్స్ మాట్లాడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. సీఎం సూచనలు ఇవ్వాలని అంటారు కానీ సభలో మైక్ ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


బెట్టింగ్ యాప్స్‌ను నిషేధిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వు తీసుకొచ్చినప్పటికీ, 15 నెలలుగా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రతి మూడు గంటలకు ఒక అత్యాచారం, ప్రతి నాలుగు గంటలకు ఒక కిడ్నాప్ జరుగుతోందని, ఇది రాష్ట్రంలో చెలరేగుతున్న నేరాలకు నిదర్శనమని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని సీఎం అంటున్నప్పటికీ, 23 శాతం క్రైమ్ పెరిగిందని డీజీపీ చెప్పారని, సీఎంగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని హరీశ్ రావు విమర్శించారు.


సీసీ కెమెరాలను సరిగ్గా నిర్వహించడం లేదని, పోలీసు వాహనాలకు డీజిల్ కోసం డబ్బులు కూడా ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. ఏక్ పోలీసు అని పోలీసు కుటుంబాలను పోలీసులే అరెస్ట్ చేశారని, సీఎం చెప్పిన ప్రాంతంలో ఇప్పటికే నాలుగు రోడ్లు ఉంటే ఐదో రోడ్డు ఎందుకని హరీశ్ రావు ప్రశ్నించారు. 5000 కోట్లతో పది వరసల రహదారి ఎవరి కోసమని, ఉద్యోగస్తులకు డబ్బులు లేనప్పుడు ఈ రోడ్డు ఎందుకని హరీశ్ రావు నిలదీశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే 200 ఎకరాల భూమి ఉందని, రాష్ట్రం బాగా ఉండాలన్నదే తమ బాధ అని హరీశ్ రావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: