
ప్రభుత్వం 150 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ ఇతర పన్నులపై రాయితీ ఇస్తున్నదని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ 150 కోట్ల రూపాయలతో రెస్టారెంట్లు సినిమా హాల్ కన్వెన్షన్ హాల్ నిర్మించవచ్చని ఆయన సూచించారు. లూలు కంపెనీతో ప్రభుత్వం చీకటి ఒప్పందం కుదుర్చుకున్నదని బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
ఇంకొక ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నడూ ఇటువంటి దాడులు జరగలేదని ఆయన వెల్లడించారు. కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి నేతల దుర్మార్గాలకు పోలీసులు వంత పాడుతున్నారని ఆయన విమర్శించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు మంత్రుల ఇంటికి కూటమి నాయకులు వెళ్లడం ఏమిటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మరో బీహార్‌గా చేయాలని కూటమి నాయకులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కూటమి నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎవరైనా తమ పార్టీలోకి వచ్చిన రాజీనామా చేయాలని టీడీపీ చెప్పిన హామీని తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఇది టీడీపీ విధానమా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. యాదవ కులానికి చెందిన మహిళను వైఎస్ జగన్ మేయర్‌గా ఎంపిక చేశారని ఆయన గుర్తు చేశారు. పార్టీలు మారేవారికి ప్రజలే బుద్ధి చెబుతారని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.