ఎవరేమన్నా తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ బూతుపిత రేవంత్‌రెడ్డి అని కేటీఆర్‌ విమర్శించారు. అద్దెలు చెల్లించకపోవడంతో గురుకుల భవనాలకు తాళాలు వేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఉంటే తాము చెల్లించామని కేటీఆర్‌ తెలిపారు. ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


ఈ ప్రభుత్వం కొత్తగా 11 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్‌ విమర్శించారు. తాము నిర్వహించిన పరీక్షలకు వీళ్లు నియామకపత్రాలు ఇచ్చారని ఆయన అన్నారు. గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తామని చెప్పి చేయలేదని కేటీఆర్‌ ఆరోపించారు. కోటి మంది మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. దళితబంధు గిరిజనబంధు కింద రూ.12 లక్షల చొప్పున ఇస్తామని చెప్పి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండు దిల్లీ పార్టీలకు తెలంగాణపై సవతితల్లి ప్రేమ మాత్రమే ఉన్నదని కేటీఆర్‌ ఆరోపించారు.


రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ తన సొంతానికి నిర్మించలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కాళేశ్వరం కూలిపోతే మల్లన్నసాగర్‌ నుంచి నీళ్లు ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు నచ్చజెప్పి భూసేకరణ చేయాలని కేటీఆర్‌ సూచించారు. ఫార్మా సిటీపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని ఆయన అన్నారు.


ఒకసారి ఫ్యూచర్‌ సిటీ అని మరోసారి ఫోర్త్‌ సిటీ ఏఐ సిటీ అని చెబుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఫార్మాసిటీలో కంపెనీల ఏర్పాటుకు 300 కంపెనీలు ముందుకు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ విధానాల వల్ల స్థిరాస్తి రంగం కుప్పకూలిందని కేటీఆర్‌ ఆరోపించారు. వ్యాపారం జరగక స్థిరాస్తి వ్యాపారులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా పేదల ఇళ్లను కూల్చుతూ ధనికుల ఇళ్లను వదిలేస్తున్నదని కేటీఆర్‌ విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr