
అన్న ఎన్టీఆర్ తన సినీ జీవితంలో సాధించాల్సినదంతా సాధించాను ఇక తనను ఆ స్థాయికి తీసుకు వచ్చిన ప్రజల కోసం ఏదైనా చేయాలని అనుకున్నారు. అలాంటి ఆలోచన నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ. మార్చి 29, 1982న హైదరాబాద్‌లో పార్టీని ప్రకటించారు. ఇప్పటికి నలభై మూడేళ్లు నిండాయి కానీ.. ఎన్టీఆర్ ఆనాడు ఎగరేసిన జెండా ఇప్పటికీ అలా సగర్వంగా ఎగురుతూనే ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా .. మరెన్నో సార్లు కింద పడినా వాటిని తట్టుకుని నిలబడింది తెలుగుదేశం. అసలు తెలుగు దేశం పార్టీ పుట్టుకే పేదోడి కోసం పుట్టింది. తెలుగుదేశం పార్టీ అంటే పేదలకు ఓ భరోసా .. పేదలకు కడుపు నిండా తిండికి…కట్టుకోవడానికి గుడ్డకి .. ఉండటానికి ఇళ్లు అన్న నినాదంతోనే ఏర్పడి ఎందరో పేదలకు పైన చెప్పిన కనీస అవసరాలు కల్పించింది.
ఇక తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం జరిగాక పేదోడికి గతంలో ఎప్పుడూ లైనంత ధైర్యం వచ్చింది. నాడు ఎన్టీఆర్ పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం.. పథకం ఇప్పటికీ కొనసాగుతుందంటే టీడీపీ ముద్ర తెలుగు గడ్డపై ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఒకప్పుడు మద్రాసీ లు అనే ముద్ర ఉన్న తెలుగు వారిని ... వీరు తెలుగు వాళ్లు .. నేను తెలుగోడిని అని గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత ఖచ్చితంగా తెలుగు దేశానికే దక్కుతుంది. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేయాలనేది ఎన్టీఆర్ తపన .. ఆ విషయంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు. తెలుగు జాతికి ప్రపంచ స్థాయిలో ఆయన వల్ల మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ అడుగుజాడల్లో పార్టీని నడుపుతూ చంద్రబాబు.. తెలుగువారంటే ..తె లుగు వారే అన్న అభిప్రాయాన్ని తీసుకువచ్చారు అని చెప్పడంలో సందేహం లేదు.
ఇక సమాజంలో సామాజిక న్యాయం తెచ్చిన పార్టీ టీడీపీ అని చెప్పాలి. పేదలకు సంక్షేమం కాదు.. వారిని ఆర్థికంగా, సామాజికంగా కూడా పైకి తీసుకువచ్చే లా తెలుగు దేశం ఎన్నో విధానాలు పాటించింది. ఈ రోజు రాజకీయాల్లో బీసీ నాయకత్వం బలంగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం. తెలుగుదేశం పుట్టుకతో ఎంతో మంది బీసీ నాయకులు తెరపైకి వచ్చారు. ఇక భారత దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ ఓ మేరు శిఖరం. తెలుగువారి జీవితాలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లే మార్గంలో టీడీపీకి మరెంతో భవిష్యత్ ఉందని ఆ పార్టీ నాయకత్వం ఫ్రూవ్ చేస్తోంది.