తెలుగు దేశం పార్టీ.. 1982. మార్చి 29న పురుడు పోసుకున్న ఈ పార్టీ.. అన‌తికాలంలోనే ప్ర‌జ‌ల‌కు చేరువైం ది. అయితే.. ఈ ప్ర‌స్తానం.. పేరు.. భ‌విష్య‌త్తు వ్య‌వ‌హారాల్లో చోటు చేసుకున్న అనేక ప‌రిణామాలు చాలా మందికి తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తొలుత.. అన్న‌గారు ఎన్టీఆర్ పార్టీ స్థాపించాల‌ని అనుకున్న‌ప్పుడు.. సంప్ర‌దించింది.. తెలుగు వారిని కాదు! త‌మిళ‌నాట పార్టీ పెట్టి.. స‌మున్న‌త శిఖ‌రాల‌కు చేరిన ఎంజీఆర్ ను. అదేస‌మ‌యంలో పార్టీకి పేరు పెట్టాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. తొలుత అనుకున్న‌ది కూడా.. టీడీపీకాదు!


ఈ విష‌యం కూడా అప్ప‌ట్లో అముద్రిత అంశంగా మిగిలిపోయింది. తొలుత అన్న‌గారికి సూచించిన పేరు.. తెలుగు నేల పార్టీ(టీఎన్‌పీ). ఈ పేరుతోనే దీనిని రిజిస్ట‌ర్ చేయించాల‌ని అనుకున్న‌ట్టు.. గ‌తంలో ఈ పార్టీలో ప‌నిచేసి.. త‌ర్వాత‌.. విబేదించి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాదెండ్ల భాస్క‌ర‌రావు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అయితే.. చివ‌రి నిముషంలో అన్న‌గారిని జాతీయ దృష్టిలో చూడాల‌ని భావించిన ప్ర‌ముఖ క‌వి.. సీ. నారాయ‌ణరెడ్డి.. నేల బాగోలేదు.. అని సూచించిన త‌ర్వాత‌.. దేశంగా మార్చారు.


అయితే..ఇక్క‌డ‌కూడా అన్న‌గారికి ఏవగింపులు వ‌చ్చాయి. దేశం పేరును ప్రాంతీయ పార్టీకి పెట్ట‌డాన్ని కాంగ్రెస్ అప్ప‌టినాయ‌కులు అభ్యంత‌రం చెబుతూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈయ‌న ప్ర‌త్యేక దేశం కోరుకుంటున్నారా? అంటూ.. అప్ప‌టి నేత జ‌ల‌గం వెంగ‌ళ‌రావు.. రాసిన‌ సుదీర్ఘ వ్యాసం అప్ప‌టి పత్రిక‌.. ఆంధ్ర‌ప‌త్రిక‌లో ప్ర‌చురిత‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. అన్న‌గారు వెనుదిర‌గ‌లేదు. ఇక‌, ఇదేస‌మ‌యంలో మ‌హిళ‌ల కోసం కూడా.. ప్ర‌త్యేక విభాగాన్ని పార్టీ ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌దేళ్ల‌కు కానీ ప్రారంభించ‌లేక పోయారు.


దీనిపైనా విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. మ‌హిళ‌ల‌కు హ‌క్కులు క‌ల్పించిన అన్న‌గారిపై ఇవే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. పార్టీలో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న విమ‌ర్శ‌ల‌ను తోసిపుచ్చుతూ.. అసెంబ్లీ సాక్షిగా అన్న‌గారు.. తెలుగు మ‌హిళ‌ పేరుతో ప్ర‌త్యేక విభాగాన్ని పార్టీలో ఏర్పాటు చేశారు. అప్ప‌టి నాయ‌కులు.. న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి, ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు, ఖ‌మ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌద‌రివంటి వారికి అవ‌కాశం ఇచ్చారు. వారు త‌ర్వాత కాలంలో ఎలా ఎదిగారో అంద‌రికీ తెలిసిందే. ఇలా.. పార్టీ లో చేసిన ప్ర‌యోగాలు అన‌న్య స‌మాన్యం. పార్టీఆవిర్భావం వేళ‌.. ఈ విష‌యాల‌ను స్మ‌రించుకోవ‌డం ముదావ‌హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp