తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు చాలా వ్యూహాత్మకంగా చెక్ పెడుతున్నట్టు కనిపిస్తోంది చంద్రబాబుకు సమకాలికుడు అయిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయనగరం ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో అశోకు ఎలాంటి అవకాశాలు లేవు యనమల రామకృష్ణుడు కుటుంబానికి మూడు అవకాశాలు ఇవ్వడంతో ఆయనను కూడా పక్కన పెట్టేశారు. యనమల తీవ్ర అసంతృప్తి.. అసహనంతో ఉన్న పట్టించుకునే వాళ్ళు లేరు. కంభంపాటి రామ్మోహన్ రావు ఒకప్పుడు ఢిల్లీలో చంద్రబాబు తరుపున అన్ని వ్యవహారాలు చక్కబెట్టారు. మరోసారి రాజ్యసభ సీట్లు ఇవ్వాలని ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పట్టించుకోవడం లేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి చిరకాల స్వప్నం మంత్రి కావటం... కానీ ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం లేదు. సొంత నియోజకవర్గంలో ఆయన చెప్పిన వారికి కూడా పోస్టింగులు ఇవ్వడం లేదు. మాజీ హోం మంత్రి చినరాజప్పది ఇదే పరిస్థితి. ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరిలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండిపోయారు.
ఇక ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి మాగంటి బాబుకు ఈ ఎన్నికలలో అసలు సీటే ఇవ్వలేదు. టిడిపిలో అత్యంత సీనియర్ నేత ఆయన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్థానం అవమానకరంగా ముగిసినట్టు ఆయన భావిస్తున్నారు. ఆయన తనకు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నా నెరవేరలేదు. రెండు నెలల కిందట రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని కూడా ఆయనకు లేకుండా చేశారు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను సాధించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పూర్తిగా పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. ఆయనకు కనీసం ఎమ్మెల్సీ అయినా వస్తుందని ఆయన పెట్టుకున్న ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఇక పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉన్న పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌కు సైతం మొన్న ఎన్నికలలో సిటి ఇవ్వలేదు.. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు చెప్పినా మొన్న ఎన్నికలలో ఎమ్మెల్సీ ఇవ్వలేదు.. చాలామంది సీనియర్ నాయకులను పార్టీ కోసం కష్టపడిన వారిని ఇప్పుడు వ్యూహాహాత్మకంగా పక్కన పెడుతున్న వాతావరణం పార్టీలో స్పష్టంగా కనిపిస్తోంది.